Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎలక్షన్ కమిషన్ వార్తలు

భద్రంగా ఖమ్మం లోకసభ ఈవీఎంలు…

స్ట్రాంగ్ రూమ్ లకు ఇవిఎం యంత్రాల తరలింపు ప్రక్రియ పూర్తయిందని ఖమ్మం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఈవీఎంలు భద్రంగా ,కట్టుదిట్టమైన భాదోబస్తు మధ్య భద్రపరిచామన్నారు … మంగళవారం జిల్లా కలెక్టర్ ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్ లలో ఇవిఎం యంత్రాల తరలింపు ప్రక్రియను ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. సంజయ్ జి కోల్టే తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ, ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ లకు సంబంధించిన ఇవిఎం యంత్రాలను స్ట్రాంగ్ రూములకు తరలించి భద్రపరిచామని తెలిపారు. ఇవిఎం యంత్రాలు స్ట్రాంగ్ రూంకు తరలింపు ప్రక్రియ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జరిగిందని, ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం పారదర్శకంగా యంత్రాలను తరలించామని కలెక్టర్ తెలిపారు. ఇవిఎం లకు మూడంచెల పటిష్ట భద్రత కల్పించినట్లు ఆయన అన్నారు. సీఆర్పీఎఫ్, ఆర్మ్డ్, స్థానిక పోలీసులు భద్రతగా నిరంతరం 24×7 కాపలా కాస్తారన్నారు. స్ట్రాంగ్ రూం కు అన్ని వైపులా సిసికెమెరాలు, టెర్రస్ పై నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు. సిసి కెమెరాల ఫుటేజ్ లు చూడడానికి టెలివిజన్ లు ఏర్పాటుచేశామన్నారు. సిసి కెమెరాలు అంతరాయం లేకుండా పనిచేయుటకు చర్యలు చేపట్టినట్లు ఆయన అన్నారు. అభ్యర్థులు, అభ్యర్థుల ఏజెంట్లు వచ్చి టెలివిజన్ లో సిసికెమెరాల పరిశీలించవచ్చని, పాసులు ఉన్నవారు స్ట్రాంగ్ రూం ల వద్దకు వెళ్లి పర్యవేక్షణ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సహాయ ఎన్నికల అధికారులు ఆదర్శ్ సురభి, బి. సత్యప్రసాద్, వేణుగోపాల్, ఎం. రాజేశ్వరి, గణేష్, రాజేందర్, మధు తహసీల్దార్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు… ‌

లోకసభ సాధారణ ఎన్నికల పోలింగ్ సంబంధించిన పత్రాలను పక్కాగా పరిశీలించామని ఖమ్మం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. మంగళవారం ఖమ్మం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ఖమ్మం రూరల్ మండలం, పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్ లలో యంత్రాల తరలింపు ప్రక్రియ అనంతరం ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. సంజయ్ జి కోల్టేతో కలిసి పోటీలో ఉన్న అభ్యర్థులు/ ఎన్నికల ఏజెంట్లతో పోలింగ్ సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ముగిసిన అనంతరం పటిష్ట బందోబస్తు నడుమ ఇవిఎం యంత్రాలను రిసెప్షన్ సెంటర్ కు, అక్కడి నుండి స్ట్రాంగ్ రూములకు తరలించామని అన్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, గతం కంటే అధిక పోలింగ్ జరిగిన పోలింగ్ కేంద్రాల పత్రాలను పరిశీలించారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగిన పోలింగ్ సరళి వివరాలను రిటర్నింగ్ అధికారి వివరించారు.

 ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, సహాయ ఎన్నికల అధికారులు ఆదర్శ్ సురభి, బి. సత్యప్రసాద్, వేణుగోపాల్, రాజేశ్వరి, గణేష్, రాజేందర్, మధు, అధికారులు, అభ్యర్థులు, వివిధ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. ‌ 

Related posts

 జూన్ 16తో ఏపీ అసెంబ్లీ గడువు ముగింపు: కేంద్ర ఎన్నికల సంఘం

Ram Narayana

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు

Ram Narayana

ఈవీఎంను హ్యాక్ చేయగలనన్న వ్యక్తి… ఈసీ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు

Ram Narayana

Leave a Comment