Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రచారం… స్పందించిన రఘురాం రాజన్!

  • రాజకీయాల్లోకి రావడం తన భార్యకు, కుటుంబానికి ఇష్టం లేదని వెల్లడి
  • రాజకీయాల్లోకి రావడానికి బదులు తనకు తోచినచోట సహాయం చేస్తానన్న రాజన్
  • ప్రభుత్వ విధానాలు దారితప్పితే కచ్చితంగా మాట్లాడుతానని స్పష్టీకరణ

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం సాగింది. ఈ అంశంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావడం తన భార్యకు, కుటుంబానికి ఇష్టం లేదన్నారు. రాజకీయాల్లోకి రావడానికి బదులు తనకు తోచినచోట సహాయం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

ప్రభుత్వంలో ఉన్నా… లేకపోయినా వారి విధానాలు దారితప్పితే తాను కచ్చితంగా మాట్లాడుతానని వెల్లడించారు. రాజకీయాల్లో ఉండాలన్నా, జనాల మధ్య ఉండాలన్నా తన వల్ల కాదని స్పష్టం చేశారు. 

రాహుల్ గాంధీపై ప్రశంసలు

రాహుల్ గాంధీ చాలా తెలివైనవాడని… ధైర్యవంతుడని ప్రశంసించారు. ఆయనకు తాను సలహాలు ఇచ్చానని ఎవరైనా అనుకుంటే పొరపాటు అన్నారు. కరోనా సమయంలో రాహుల్ సరిగ్గానే వ్యవహరించారని తాను భావిస్తున్నానని చెప్పారు. నాయనమ్మను, తండ్రిని కోల్పోయిన కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడవద్దన్నారు. 

అదే సమయంలో రాహుల్ గాంధీ వద్ద అన్నింటికీ సమాధానాలు లేవని కూడా అభిప్రాయపడ్డారు. అందరు చూస్తున్న దానికంటే రాహుల్ భిన్నమైన వ్యక్తి అని పేర్కొన్నారు. చాలా అంశాలపై ఆయనకు స్పష్టత ఉందని… ఆయా అంశాలపై ఏకీభవించకుంటే వాటిపై చర్చ జరపాలని సూచించారు. ఆ చర్చలకు ఆయన కూడా సిద్ధంగానే ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు.

Related posts

అగ్నివీర్‌ పథకాన్ని చెత్తబుట్టలో వేస్తా: రాహుల్ గాంధీ

Ram Narayana

జీ-20 విందుకు తనను ఆహ్వానించకపోవడంపై మల్లికార్జున ఖర్గే స్పందన

Ram Narayana

రాహుల్ గాంధీ మరో యాత్ర.. ‘భారత్ న్యాయ్ యాత్ర’ పేరుతో మణిపూర్ టు ముంబై

Ram Narayana

Leave a Comment