నేను నా అనే అహంకారమే జగన్ ని దెబ్బతీసిందా …?
ఓట్లు రాల్చని సంక్షేమ పథకాలు
జగన్ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలం
పనిచేయని మూడు రాజధానుల అన్న డైలాగ్
మైనస్ గా అధికారంలోకి వచ్చిరాగానే కూల్చివేతలు
ఎమ్మెల్యేలకు తగిన గుర్తింపు లేకపోవడం …ఎమ్మెల్యేల మార్పు
ఆయన్ను నమ్మి దగ్గరైన వాళ్ళను దూరం పెట్టారు …
తల్లి, చెల్లి ప్రభావం
ఓట్లు రాల్చని సంక్షమే పథకాలు …
నేను నా అనే అహంకారమే జగన్ దెబ్బతీసిందా …అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. కర్ణుడి చావుకు అనేక కారణాలు ఉన్నట్లు జగన్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి…అన్ని ఆయన స్వయం కృతాపరాధమే … ఎన్నో ఆశయాలు ఆకాంక్షలతో 2019 లో ల్యాండ్ స్లయిడ్ విక్టరీ అందించిన ఆంధ్రా ఓటర్లు జగన్ వ్యక్తిగత పోకడల వల్ల నెలకు కొట్టారు … గతంలో చంద్రబాబు కు ఇచ్చిన విధంగానే తీర్పు ఇచ్చారు … ఎవరు ఎన్ని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా తలా కిందులు చేస్తూ ఓటర్లు తమకు అవకాశం వచ్చినప్పుడు తీర్పు ఇచ్చి మీదారి రహదారి కాదని అడ్డదారుల్లో వస్తే దెబ్బలు తప్పవని నిరూపించారు … ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలం జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ..అమరావతిని కాదని మూడు రాజధానుల అన్న డైలాగ్ పనిచేయలేదు ..వచ్చి రావడంతోనే ప్రజాభవన్ కూల్చివేత మైనస్ గా మారింది … అందుకే దటీస్ ద బ్యూటీ అఫ్ డెమోక్రసీ అంటున్నాం ..
ఎమ్మెల్యేలకు తగిన గుర్తింపు లేకపోవడం …
ఏ నిర్ణయమైనా ఎమ్మెల్యేలను సంప్రదించే బదులు తన బుర్రలో పుట్టిందే చెప్పి ఇంప్లిమెంట్ చేయడంపై అసంతృప్తితో ఉన్నారు … అధికారం ఉన్నందున ఏమి అనలేక యస్ బాస్ అనడం మినహా ఎదురు చెప్పలేదు …ప్రజల మనస్సులో ఏముందో తెలుసు కోవడం అటుంచితే తమ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోవడంలో వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి… ఇది జగన్ పాలిట శాపంగా మారింది …అధికారం దక్కకపోవడం అంటుంచి ఈడ్చి నెలకు కొట్టారు …
ఆయన్ను నమ్మి దగ్గరైన వాళ్ళను దూరం పెట్టారు …
వైయస్ రాజశేఖర్ రెడ్డి షరిస్మా తో అధికారంలోకి వచ్చిన జగన్ అందుకు అనుగుణంగా పరిపాలన సాగించిన తన నమ్మకస్తులైన స్నేహితులను తన వెంట నిలుపుకోలేక పోయాడు …మొదటి నుంచి ఆయనతో వెళ్లిన అనేక మంది ఆయన్ను విభేదించారు …ఆయనకు దూరం జరిగారు …తన ప్రత్యర్థి పార్టీల్లో చేరారు …ఆలా మొదటగా సిబిఐ దాడులు కేసుల నేపథ్యంలో తన వెంట ఉన్న కొణతాల రామకృష్ణ ,మైసూరా రెడ్డి , తర్వాత సందర్భాల్లో ఆనం రామనారాయణ రెడ్డి , చివరకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి , శ్రీధర్ రెడ్డి , ఉండవల్లి శ్రీదేవి లాంటి ఎమ్మెల్యేలను తన నుంచి దూరం చేసుకోవడం బ్లండర్ మిస్టేక్ అనే చెప్పాలి …అంతే తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే ప్రాణసమానంగా భావించే కెవిపి రామచందర్ రావు , ఉండవల్లి అరుణ కుమార్ , రఘువీరా రెడ్డి లాంటి వారి సలహాలు తీసుకోవడం కానీ వారికీ తగిన గౌరవం ఇవ్వడం జరగలేదని అభిప్రాయాలు ఉన్నాయి…
తల్లి, చెల్లి ప్రభావం
చివరకు తాను జైల్లో ఉన్నప్పుడు తనకు అండగా ఉన్న తోబుట్టువు వైయస్ షర్మిలకు ఎదో ఒక పదవి ఇచ్చి తనతో కలిసి నడిచేలా చేసే బదులు వారిని శత్రువులుగా చేసువకోవడం జగన్ చేసిన పెద్ద తప్పిదం …తాను అధికారం చేపట్టడంలో తన వయస్సును కూడా లెక్క చేయకుండా అహోరాత్రులు కష్టపడ్డా తల్లి విజయమ్మ విషయంలో ఎక్కడో లోపం జరిగిందే అభిప్రాయాలు ఉన్నాయి…. అధికారుల విషయంలోనూ ఆయన వారి అభిప్రాయాలను పట్టించుకోలేదని మాజీ ఏపీ సి ఎస్ సుబ్రహ్మణ్యం పలుమార్లు చెప్పారు ..
వివేకానందరెడ్డి హత్య కేసు …
తన చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో తమకు అన్యాయంజరిగిందని కూతురు సునీతా రెడ్డి , షర్మిల చేసిన ప్రచారం కూడా జగన్ కు మైనస్ గా మారింది … దాన్ని తిప్పికొట్టడంలో లేదా అసలు దోషులు ఎవరో నిరూపించడంలో జగన్ తగిన విధంగా వ్యవహరించలేదనే భావన ప్రజల్లో ఉంది …
ఎమ్మెల్యేల మార్పు
ఇక ఎమ్మెల్యేలను మార్చడం అనేది తుగ్లక్ చర్యగా మారింది ….ఐదు సంవత్సరాలు ఒక నియోజకవర్గంలో పనిచేసిన వ్యక్తిని మరో నియోజకవర్గానికి మార్చి పోటీచేయమనడం పై తీవ్ర అసంతృప్తి ఉంది …అంటే వారి వ్యక్తిగత ఇమేజ్ ను ఏమాత్రం అంగీకరించకుండా జగన్ పేరుతోనే గెలవాలని జగన్ భావించినట్లు ప్రచారం జరిగింది ..ఇది వ్యక్తి సామ్యంగా మారింది …మంత్రివర్గంలో సీనియర్స్ ఉన్న వారిని తగిన విధంగా గౌరవించలేదని విమర్శలు ఉన్నాయి…కర్నూలు ఆఫీజ్ ఖాన్ ను కాదని ఐఏఎస్ అధికారిని పోటీకి పెట్టడం . విడుదల రజినీని చిలకలూరు పేట నుంచి గుంటూరు కు మార్చడం …నరసరావు పేట పార్లమెంట్ స్థానంలో శ్రీకృష్ణ దేవరాయలు కాదని అక్కడ ఎమ్మెల్యేలు ఎంత మొత్తుకున్నా బయటకు పంపి నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ ను తేవడం మూర్ఖత్వం అనే అభిప్రాయాలు ఉన్నాయి…
ఓట్లు రాల్చని సంక్షమే పథకాలు
జగన్ సంక్షేమ పథకాలను నమ్ముకున్నారు …2 లక్షల 70 వేల కోట్ల రూపాయలను బటన్ నొక్కడం ద్వారా ప్రజలకు నేరుగా ప్రత్యేకంగా మహిళలకు అందించామని ప్రతిసభలో చెప్పారు …నేను మంచి చేశానని భావిస్తేనే నాకు మద్దతు ఇవ్వండని సైనికులుగా పనిచేయాలని కోరారు …వాటిని ప్రజలు పట్టించుకోలేదు …పైగా అభివృద్ధి కుంటు పడిందని,రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిందని విపక్షాలు చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారు … మూడు రాజధానుల డైలాగ్ పట్టించుకోలేదు …
వాలంటీర్ల వ్యవస్థ …
వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలు పెన్షన్లు పంపిణి , రేషన్ అందించడం , గ్రామసచివాలయాల ద్వారా ప్రజలు సేవలు , విలేజ్ క్లినిక్ లు పెట్టి ప్రజలకు మేళ్లు చేశామని చెప్పిన ప్రజలు మార్పును కోరుకున్నారు …