Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణాలో కాంగ్రెస్ కు 8 – బీజేపీకి 8 ఎంపీ సీట్లు

హోరాహోరీగా జరిగిన లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 17 సీట్లు ఉండగా బీజేపీ , కాంగ్రెస్ చేరి 8 సీట్లు గెలుపొందగా , ఎంఐఎం హైద్రాబాద్ ను తిరిగి నిలబెట్టుకుంది …గత లోకసభ ఎన్నికల్లో బీజేపీకి 4 ,కాంగ్రెస్ కు 3 , బీఆర్ యస్ కు 9 సీట్లు రాగ , ఈసారి కాంగ్రెస్ , బీజేపీ బలాన్ని పెంచుకోగా , బీఆర్ యస్ జీరో తో తుడిచిపెట్టుకు పోయింది … తెలంగాణాలో సత్తాచాటాలని అటు బీజేపీ ,ఇటు కాంగ్రెస్ వ్యూహరచన చేశాయి….ప్రధాని మోడీ , హోమ్ మంత్రి అమిత్ షా జెపి నడ్డా , కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ , మల్లికార్జన ఖర్గే ప్రియాంక గాంధీ ప్రచారంలో పాల్గొన్నారు…బీఆర్ యస్ తరుపున ఆపార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు లు విస్తృత ప్రచారం గావించారు …ఎన్నికల్లో కాంగ్రెస్ , బీజేపీలకు సమానంగా సీట్లు ఇచ్చి ఓటర్లు తీర్పునిచ్చారు …అయితే బీఆర్ యస్ బాగా దెబ్బతిన్నది ..కార్ షడ్డుకు పోయిందని వైరి పక్షాలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి…

కాంగ్రెస్ గెలిచిన ఎంపీ స్థానాలు…

ఖమ్మం ………………..రామసహాయం రఘురాంరెడ్డి …4 .67 లక్షలు
నల్గొండ………………..కుందూరు రఘువీర్ రెడ్డి……….5 .51 లక్షలు
మహబూబాబాద్…….పోరిక బలరాం నాయక్ ……….3 లక్షలపైగా
వరంగల్………………కడియం కావ్య ……………………. 1 .79 లక్షలు
భవనగిరి………………కిరణ్ కుమార్ రెడ్డి………………..1 .95 లక్షలు
పెద్దపల్లి ……………..గడ్డం వంశీ ………………………….1 .26 లక్షలు
నాగర్ కర్నూల్ …….మల్లు రవి …………………………… 82 వేలు
జహీరాబాద్ ……….సురేష్ షట్కర్ ……………………….43 వేలకు పైగా

బీజేపీ గెలిచినవి

కరీంనగర్…………..బండి సంజయ్………………..1 .86 లక్షలు
నిజామాబాద్……….ధర్మపురి అరవింద్……………1 .28 లక్షలు
ఆదిలాబాద్ ……….నగేష్……………………………….66 వేలకు పైగా
సికింద్రాబాద్………జి .కిషన్ రెడ్డి ……………………65 వేలు
మల్కాజిగిరి ……….ఈటల రాజేందర్……………..3 .14 లక్షలు
చేవెళ్ల……………….కొండా విశ్వేశ్వరరెడ్డి…………..1 .27 లక్షలు
మహబూబ్ నగర్..డీకే అరుణ ……………………….10 వేలు
మెదక్……………..ఎం రఘునందన్ రావు………….34 వేలు

హైద్రాబాద్ (ఎంఐఎం ) లు ఉన్నాయి… అసదుద్దీన్ ఒవైసి …3 .15 లక్షలు

పైన ఇచ్చిన సంఖ్యలన్నీ మోజార్టీలు …అయితే చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశం గమనించగలరు …

Related posts

 ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కోదండరాంను ఎలా ఆమోదించారు?: గవర్నర్‌కు కేటీఆర్ ప్రశ్న

Ram Narayana

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు… వీడియో ఇదిగో

Ram Narayana

ఖమ్మంకు తుమ్మల…. పాలేరుకు పొంగులేటి….?

Ram Narayana

Leave a Comment