Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు… డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్

  • ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో 24 మంది మంత్రులతో క్యాబినెట్
  • సుదీర్ఘ కసరత్తుల అనంతరం మంత్రులకు శాఖల కేటాయింపు
  • పవన్ కు ఉప ముఖ్యమంత్రి పదవి 
  • లోకేశ్ కు ఐటీ శాఖ
  • హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనిత

ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయగా, మంత్రులుగా మరో 24 మంది ప్రమాణం చేశారు. 

నిన్ననే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు… వెంటనే మంత్రులకు శాఖల కేటాయింపుపై నిన్న అర్ధరాత్రి దాటాక కూడా కసరత్తులు చేశారు. ఈ మధ్యాహ్నానికి మంత్రులకు శాఖల కేటాయింపు ఓ కొలిక్కి వచ్చింది. 

సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు తనవద్దనే ఉంచుకున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ కు పంచాయతీరాజ్, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు. మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేశ్ కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖలు అప్పగించారు. 

ఏపీ మంత్రులు… వారికి కేటాయించిన శాఖలు…

  • సీఎం చంద్రబాబు- సాధారణ పరిపాలన, లా అండ్ ఆర్డర్
  • పవన్ కల్యాణ్- పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా 
  • నారా లోకేశ్- మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ (రియల్ టైమ్ గవర్నెన్స్)
  • వంగలపూడి అనిత- హోం శాఖ, విపత్తు నిర్వహణ
  • అచ్చెన్నాయుడు- వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ, డెయిరీ, మత్స్యశాఖ
  • కొల్లు రవీంద్ర- ఎక్సైజ్, గనులు, జియాలజీ
  • నాదెండ్ల మనోహర్- ఆహార, పౌర సరఫరాలు
  • పొంగూరు నారాయణ- పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి
  • సత్యకుమార్ యాదవ్- వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ
  • నిమ్మల రామానాయుడు- జల వనరుల అభివృద్ధి శాఖ
  • ఆనం రామనారాయణరెడ్డి- దేవాదాయ శాఖ
  • మహ్మద్ ఫరూఖ్- న్యాయ శాఖ, మైనారిటీ సంక్షేమం
  • పయ్యావుల కేశవ్- ఆర్థిక శాఖ, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాలు
  • అనగాని సత్యప్రసాద్- రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపులు
  • కొలుసు పార్థసారథి- గృహ నిర్మాణం, సమాచారం, ప్రజా సంబంధాల శాఖ
  • డోలా బాల వీరాంజనేయ స్వామి- సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాల శాఖ
  • గొట్టిపాటి రవికుమార్- విద్యుత్ శాఖ
  • కందుల దుర్గేశ్- టూరిజం, సాంస్కృతిక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ
  • గుమ్మిడి సంధ్యారాణి- మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం
  • బీసీ జనార్దన్ రెడ్డి- రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు
  • టీజీ భరత్- పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్
  • ఎస్.సవిత- బీసీ సంక్షేమం, ఆర్థికంగా బలహీనవర్గాల సంక్షేమం, చేనేత, టెక్స్ టైల్స్
  • వాసంశెట్టి సుభాష్- కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, ఆరోగ్య బీమా సేవలు
  • కొండపల్లి శ్రీనివాస్- సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్నారై సాధికారత మరియు సంబంధాలు
  • మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి- రవాణా, క్రీడలు, యువజన సర్వీసులు

Related posts

మళ్ళీ మాదే అధికారం…సజ్జల

Ram Narayana

జనసేన పార్టీకి చిరంజీవి భారీ విరాళం… రూ.5 కోట్ల చెక్ పవన్ కు అందజేత

Ram Narayana

రఘురామ కృష్ణంరాజు నిజంగా పందెం కోడే…!

Ram Narayana

Leave a Comment