Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయంక్రైమ్ వార్తలు

అమెరికాలో భార‌తీయుడి న‌గ‌ల దుకాణంలో చోరీ.. మూడు నిమిషాల్లో లూటీ..

  • ఈ నెల 12న కాలిఫోర్నియాలో ఘటన
  • ఈ ఘ‌ట‌న తాలూకు సీసీటీవీ దృశ్యాలు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్
  • సుమారు 20 మంది ముసుగు దొంగలు ఈ దోపిడీకి పాల్ప‌డిన వైనం
  • పోలీసుల అదుపులోకి ఐదుగురు అనుమానితులు

అమెరికాలో బ్రాండెడ్ షోరూంల నుంచి కూడా దొంగ‌లు ద‌ర్జాగా వ‌స్తువుల్ని దోచుకెళ్తున్నారు. తాజాగా కాలిఫోర్నియాలో సినిమాల్లో చూపించే చోరీలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఓ భారత వ్యాపారికి చెందిన‌ నగల దుకాణంలో దోపిడీ జరిగింది. 

దుండగులు కేవలం మూడే మూడు నిమిషాల్లో దుకాణాన్ని లూటీ చేశారు. ఈ నెల 12న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘ‌ట‌న తాలూకు సీసీటీవీ దృశ్యాలు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. 

వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. సుమారు 20 మంది ముసుగు దొంగలు ఈ దోపిడీకి పాల్పడ్డారు. షాపునకు కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డును భయపెట్టి, అద్దాల ద్వారం పగులకొట్టి వారు షాపులోకి ప్రవేశించారు. ఆ త‌ర్వాత వెంటనే షోరూం అంతా వ్యాపించి డెస్కుల అద్దాలను పగులగొట్టి అందినకాడికి ఆభ‌ర‌ణాల‌ను బ్యాగుల్లో వేసుకొని పరారయ్యారు. 

ఈ దోపిడీ తాలూకు దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అవి కాస్తా బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. కాగా, లూటీ చేసిన దుండ‌గుల‌కు ప్రాంతం గురించి బాగా తెలిసినట్టు అనిపిస్తోందని స్థానిక మీడియా పేర్కొంది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మిగ‌తావారి కోసం గాలిస్తున్నారు. 

కాగా, పూణె కేంద్రంగా ఉన్న బాధిత పీఎన్‌జీ జ్యువెల్లర్స్‌కు యూఎస్‌, దుబాయిలలో క‌లిపి 35 శాఖ‌లు ఉన్నాయి. ఈ సంస్థ‌ను పురుషోత్తం నారాయ‌ణ్ గాడ్గిల్ స్థాపించారు. ఒకే ఒక స్టోర్ నుంచి ఇవాళ ఈ కంపెనీ  గ్లోబ‌ల్ చైన్‌గా ఎద‌గ‌డం విశేషం.

Related posts

హత్య కేసులో.. బ్రిటన్‌లో నలుగురు భారత సంతతి వ్యక్తులకు జీవితకాల జైలు శిక్ష…

Ram Narayana

తెలంగాణలో క్రైమ్ రేటు పెరిగిందన్న వార్తలు అవాస్తవం: డీజీపీ మహేందర్ రెడ్డి…

Drukpadam

గొలుసు దొంగతనాల వ్యక్తి హోటల్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే రాక!

Drukpadam

Leave a Comment