Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

కొందరు నేతలు మాతో టచ్‌లో ఉన్నారు…రాహుల్ గాంధీ

చిన్న సమస్య తలెత్తినా ప్రభుత్వం కూలిపోతుంది

  • మోదీ ప్రభుత్వం మనుగడ కోసం ఇబ్బందిపడే అవకాశముందన్న రాహుల్ గాంధీ
  • ఎలాంటి వివక్ష లేకుంటే ఇండియా కూటమి మెజార్టీ దక్కించుకునేదని వ్యాఖ్య
  • చేతులు కట్టేసిన పరిస్థితుల్లో పోరాడామన్న రాహుల్ గాంధీ

ఎన్డీయే కూటమిలోని నేతలు కొంతమంది తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… నరేంద్రమోదీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మనుగడ కోసం ఇబ్బందిపడే అవకాశముందన్నారు. కూటమి బలహీనంగా ఉందని… కాబట్టి ఏ చిన్న సమస్య తలెత్తినా ప్రభుత్వం కూలిపోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోదీ విద్వేషాలను వ్యాప్తి చేసి… ఫలితాలను పొంది ఉండవచ్చునని వ్యాఖ్యానించారు. కానీ ఈసారి ప్రజలు ఆ ఆలోచనను తిరస్కరించారని పేర్కొన్నారు. ఎలాంటి వివక్ష లేని పరిస్థితులు ఉంటే కనుక తమ ఇండియా కూటమి తప్పకుండా మెజార్టీ దక్కించుకొని ఉండేదని వ్యాఖ్యానించారు. చేతులు కట్టేసిన పరిస్థితుల్లో తాము పోరాడామన్నారు. అలాంటి సమయంలో ప్రజలు ఇండియా కూటమికి మంచి స్థానాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు. బీజేపీ పదేళ్లుగా అయోధ్య గురించే మాట్లాడుతూ వస్తోందని… కానీ అదే అయోధ్యలో ఆ పార్టీ ఓడిపోయిందని గుర్తు చేశారు.

Related posts

ఇది మోడీ రాజకీయం …!

Ram Narayana

టైటానిక్‌లా బీజేపీ మునిగిపోవాలంటే మోదీయే బెస్ట్!: సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు…

Ram Narayana

సవాల్ విసిరి… మంత్రి పదవికి రాజీనామా చేసిన రాజస్థాన్ బీజేపీ నేత

Ram Narayana

Leave a Comment