Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో భూకబ్జా …రైతు ఆత్మహత్య…

ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో భూకబ్జా వివాదంలో బోజెడ్ల ప్రభాకర్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు …తన ఆత్మహత్యకు అదే గ్రామానికి చెందిన కొందరు కారణమని ఆరోపిస్తూ వీడియో మెసేజ్ చేసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది …స్థానిక కాంగ్రెస్ నేతలు,డిప్యూటీ సీఎం భట్టి అనుచరులే ఇందుకు కారణమని బీఆర్ యస్ ఆరోపణలు గుప్పించింది ..భాద్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది ..

ఏం జరిగిందంటే..
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో బోజడ్ల ప్రభాకర్ అనే రైతుకు ఏడెకరాల భూమి ఉంది. ఇందులో 3 ఎకరాల 10 గుంటల పొలాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆక్రమించారు. సర్వే నెంబర్ 276, 277 లో ఉన్న తన పొలాన్ని ట్రాక్టర్లు, జేసీబీలు, బుల్డోజర్లతో ధ్వంసం చేశారని ప్రభాకర్ సూసైడ్ వీడియోలో చెప్పాడు. గ్రామానికి చెందిన కూరపాటి కిషోర్, పెంట్యాల రామారావు, గుర్రం నాగమల్లేశ్వరరావు, మొగిలి శ్రీను,మొగిలి ముత్తయ్యలు తన పొలాన్ని ఆక్రమించారని ఆరోపించాడు.

దీనిపై చింతకాని ఎమ్మార్వో, ఎస్సైలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేయడానికి వెళితే టైమ్ అయిపోయిందని అధికారులు వెనక్కి పంపారని ప్రభాకర్ కన్నీటి పర్యంతమయ్యాడు. మరో మార్గం లేక పురుగుల మందు తాగుతున్నానని, తాను ఉన్నా లేకున్నా తన కుటుంబానికి న్యాయం చేయాలని వీడియోలో అర్థించాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తనకు న్యాయం చేయాలని కోరాడు. ఆపై పురుగుమందు తాగి ప్రభాకర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Related posts

ఈ నెల 25న రాష్ట్ర గవర్నర్ పర్యటన.. అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ

Ram Narayana

నిరంతరం ప్రజా సేవలోనే ఉంటాం-అన్నా అంటే అండగా నిలుస్తా మంత్రి పొంగులేటి!

Ram Narayana

ఉగాది నుంచి ఆడబిడ్డలకు సన్నబియ్యం..మంత్రి పొంగులేటి

Ram Narayana

Leave a Comment