Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

వామ్మో.. ఈకిలాడీ …50 పెళ్ళిళ్ళు చేసుకుంది..!

వామ్మో.. ఈకిలాడీ …50 పెళ్ళిళ్ళు చేసుకుంది..!
డీఎస్పీతో పాటూ ఎస్సైలు, వ్యాపారవేత్తలు కూడాఆమె బాధితులే..!!
తమిళనాడులో నిత్య పెళ్లి కూతురి బాగోతం ఆలస్యగా వెలుగులోకి వచ్చింది.
సంధ్య అనే యువతి 50 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది.
ఒక్కో పెళ్లికి ఒక్కో పేరు.. ఇలా 50 మందిని వివాహం చేసుకుంది.
పెళ్లి అయిన రెండు మూడు రోజుల్లో డబ్బు, నగలతో ఉడాయించేది.
డేట్ ద తమిళ్ వే అనే వెబ్ సైట్ లో తన ప్రొఫైల్ ఉంచి యువకులకు వల వేసిన సంధ్య ..
సంధ్య బండారాన్ని తిరువూరుకు చెందిన ఓ యువకుడు బయటపెట్టాడు.

వామ్మో ఈకిలాడీ లేడి ఒకటికాదు రెండు కాదు వరసగా 50 పెళ్లిళ్లు చేసుకుంది …తన ఫోటోలను మాట్రిమోనిలో పెట్టి వచ్చిన వరుడితో పెళ్లి చేసుకొని రెండు రోజులు గడిపి అతి తెలివిగా డబ్బు నగలతో సహా ఉడవించేది …ఈమె భాదితులు పోలీస్ అధికారులు , వ్యాపారులు , ఉండటం విశేషం …అయితే చివరగా ఈమాయలాడిని ఏపీలోని తిరువూరుకు చెందిన యువకుడు పెళ్లి చేసుకున్నాడు …అతనికి ఎందుకో అనుమానం వచ్చి ఆమె ఆధార్ కార్డు పరిశీలించాడు …అందులో మరో వ్యక్తి పేరు భర్తగా ఉంది …ఆమె కూపీ లాగాడు … డొంక కదిలింది …కటకటాలపాలైంది …ఇప్పటివరకు మొత్తం 50 ని పెళ్లి చేసుకొని వారికీ మస్కా కొట్టి వెళ్లి పోయేది … ఈకేసు విన్న పోలీసులకే మతి పోయింది …

సంధ్యతో పెళ్లైన మరుసటి రోజే ఆమెపై అనుమానంతో ఆధార్ కార్డు పరిశీలించాడు. అయితే, అందులో సంధ్య భర్తగా మరో వ్యక్తి పేరు ఉండటంతో కూపీ లాగాడు. దీంతో సంధ్య బండారం మొత్తం బయటపడింది. పెళ్లి పేరుతో 50 మంది యువకులను యువతి మోసం చేసిన ఉదంతంసంచలనంగా మారింది. సంధ్య బాధితుల్లో పోలీసులు కూడా ఉండటం షాక్ కి గురి చేసే అంశం.

డీఎస్పీ, ఎస్ఐ, పలువురు ఫైనాన్షియర్లు మోసపోయిన వారిలో ఉన్నారు. మాయమాటలు చెప్పి వారందరిని పెళ్లి చేసుకుంది సంధ్య. పెళ్లి తర్వాత మొదటి రెండు రాత్రులు గడిచాక.. మూడో రోజు పెళ్లింట్లో ఉన్న డబ్బు, నగదుతో ఉడాయించేది. మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో తన అందమైన ఫొటోలు ఉంచి చాలామంది యువకులను ట్రాప్ చేసింది. వారిని పెళ్లాడి ఆ తర్వాత అందినకాడికి దోచుకుని ఎస్కేప్ అయ్యేది. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 50 మంది సంధ్య చేతిలో నిలువునా మోసపోయారు.

Related posts

కాకినాడ చెరువు నీటిలో విషం.. చచ్చిపోయి ఒడ్డుకు కొట్టుకొస్తున్న వేలాది చేపలు…

Drukpadam

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు!

Drukpadam

డీసీపీనే లంచం అడిగిన పోలీస్ కానిస్టేబుల్ !

Drukpadam

Leave a Comment