పొద్దుటూరు లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి ..
ప్రభాకర్ కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ
ప్రభాకర్ ఆత్మహత్య బాధాకరం .. చావు పరిస్కారం కాదు
ఆయన భూసమస్య పరిష్కరానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించాం
ఆయన ఆత్మహత్యకు కారకులపై చట్ట ప్రకారం చర్యలు
చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన రైతు బోజెడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పరామర్శించారు …జరిగిన సంఘటనకు దారితీసిన పరిస్థితులను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు …కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు …పిల్లల చదువులకు కూడా సహాయం అందిస్తామని అన్నారు ..
అక్కడ ఏమన్నారో భట్టి మాటల్లోనే
చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు భోజండ్ల ప్రభాకర్ సంబంధించి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత దురదృష్టకరం…తన భూమి చెరువు శిఖంలోని భూమిలో వేసిన మెరకను తొలగించారని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు వీడియో ద్వారా తెలిసింది. ..ఈ విషయంపై ఇప్పుడే మృతుడి తండ్రిగారితోను, ఆయన భార్యతోను, ఇతర కుటింబ సభ్యులతోనూ మాట్లాడడం జరిగింది… జరిగిన సంఘటన చాలా బాధాకరం. ప్రాణం చాలా విలువైనది. మనం పుట్టింది బతకడానికే కానీ చావడానికి కాదు. ఎంత పెద్ద సమస్య ఉన్న ఎక్కడో ఒకచోట పరిష్కార మార్గం చూసుకొని బతికేందుకు ప్రయత్నం చేయాలి. ఎవరు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను…ప్రభాకర్ ను ఆత్మహత్యకు పురిగొల్పిన, దానికి దారి తీసేలా పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే, ఎంత పెద్ద వారైనా సరే నిష్పక్షపాతంగా విచారణ జరిపించి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది…ఇక్కడ ఉన్న వారంతా నా వారే. జరిగిన పొరపాటుకు కారణం ఎవరైనా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు ఎవరిని వదిలి పెట్టేది లేదు.
మృతుడు ప్రభాకర్ కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తాం. ఆ భూమికి సంబంధించి శాశ్వతమైన పరిష్కారం లభించేలా చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది…పిల్లలు చదువుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. పిల్లలు బాగా చదువుకొని గొప్పగా వృద్ధిలోకి రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను…మరి కొన్ని సమస్యల గురించి ఆ కుటుంబ సభ్యులు నాకు ఒక పిటిషన్ ఇచ్చారు దానిని పూర్తిగా పరిశీలించి వారికి తగు న్యాయం చేస్తానని న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది.