- హేమంత్ సోరెన్‌కు అనుకూలంగా 45 ఓట్లు
- వాకౌట్ చేసిన విపక్షం
- ఇటీవల బెయిల్‌పై విడుదలైన హేమంత్ సోరెన్
ఝార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం నిర్వహించిన బలపరీక్షలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నెగ్గారు. 81 మంది ఎమ్మెల్యేలకు గాను 45 మంది ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. ఓటింగ్ సమయంలో విపక్షాలు వాకౌట్ చేశాయి. హేమంత్ సోరెన్ భూకుంభకోణం కేసులో అరెస్టై ఇటీవల విడుదలయ్యారు. ఆయన అరెస్ట్ తర్వాత దాదాపు ఐదు నెలలు చంపయి సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. హేమంత్ సోరెన్ విడుదల కావడంతో ఆయన రాజీనామా చేశారు. ఐదు నెలల అనంతరం మళ్లీ సీఎంగా ప్రమాణం చేశారు.
హేమంత్ ఇటీవల మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అధికార కూటమిలో హేమంత్ సోరెన్‌కు చెందిన జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ప్రతిపక్షానికి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు ఎంపీగా పోటీ చేశారు. దీంతో సభలో సంఖ్యాబలం 76కు తగ్గింది.