క్రికెట్ వార్తలు

మూడో టీ20లో టీమిండియాదే విజయం… సిరీస్ లో ముందంజ

  • నేడు టీమిండియా, జింబాబ్వే మధ్య మూడో టీ20
  • 23 పరుగుల తేడాతో టీమిండియా జయభేరి
  • మొదట 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసిన టీమిండియా
  • లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులే చేసిన జింబాబ్వే

హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఆతిథ్య జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన జింబాబ్వేను టీమిండియా బౌలర్లు సమర్థంగా కట్టడి చేశారు. 

ఛేజింగ్ లో జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులే చేసి ఓటమిపాలైంది. జింబాబ్వే ఇన్నింగ్స్ లో డియాన్ మైర్స్ 65 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 49 బంతులు ఎదుర్కొన్న మైర్స్ 7 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. మైర్స్ కు వికెట్ కీపర్ క్లైవ్ మడాండే నుంచి చక్కని సహకారం లభించింది. మడాండే 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 37 పరుగులు చేశాడు. 

జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా (13) ఈ మ్యాచ్ లోనూ విఫలమయ్యాడు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, అవేశ్ ఖాన్ 2, ఖలీల్ అహ్మద్ 1 వికెట్ తీశారు. టీమిండియా ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 2-1తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జులై 13న జరగనుంది.

Related posts

25 ఏళ్ల తర్వాత భార‌త్‌కు ఘోర పరాభవం.. ఓటమిపై కెప్టెన్ గిల్ ఏమ‌న్నాడంటే..!

Ram Narayana

ఆసియా కప్ ట్రోఫీ వివాదం.. ఐసీసీకి చేరిన పంచాయితీ!

Ram Narayana

బెంగళూరు తొక్కిసలాట ఘటన.. కోహ్లీని అరెస్ట్ చేయాలంటూ #ArrestKohli హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌

Ram Narayana