ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

జగన్ రాజీనామా తప్పుడు ప్రచారం …. వైవీ సుబ్బారెడ్డి

జగన్ రాజీనామా తప్పుడు ప్రచారం …. వైవీ సుబ్బారెడ్డి
జగన్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు
జగన్ రాజీనామా చేస్తారంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్న సుబ్బారెడ్డి
రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా అవసరమని వ్యాఖ్య
ఇద్దరు సీఎంల సమావేశం మంచిదేనన్న సుబ్బారెడ్డి

మాజీ సీఎం జగన్ పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేసి కడప ఎంపీకి పోటీచేస్తున్నారని. కడప ఎంపీ అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తారని ,పులివెందులకు ఎవరని అభ్యర్థిగా నిర్ణయిస్తారోనని జరుగుతున్న ప్రచారంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. అనవసర దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జగన్ రాజీనామా చేయరని… చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. గత ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని… ఇసుక పాలసీపై కావాలంటే విచారణ జరుపుకోవచ్చని అన్నారు.

ఏపీ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా కావాల్సిందేనని సుబ్బారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి… విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి నిధులు రాబట్టాలని డిమాండ్ చేశారు. విభజన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడం మంచి పరిణామమని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం కావాలనే కోరుకుంటున్నామని అన్నారు.

Related posts

పవన్ ఆదేశాలు… సరస్వతి పవర్ సంస్థ భూముల్లో అధికారుల సర్వే

Ram Narayana

కార్యకర్తలే మా అధినేతలు, వారే మా ప్రాణం… మహానాడు తొలిరోజు చంద్రబాబు ప్రసంగం హైలైట్స్!

Ram Narayana

హోమ్ మంత్రి అనితపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు …భగ్గుమన్న మంద కృష్ణమాదిగ

Ram Narayana