Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

దేశ వనరులు వృథా అవుతున్నాయి.. బంగ్లా అల్లర్ల‌పై మాజీ ప్రధాని ఖలీదా జియా ఆవేదన!

  • మంగళవారం గృహనిర్బంధం నుంచి విడుదలైన ఖలీదా జియా
  • బంగ్లాదేశ్‌ ఖిలాఫత్‌ మజ్లీస్‌ ప్రధాన కార్యదర్శి మౌలానా మమునుల్ హక్‌తో భేటీ
  • దేశంలో జ‌రుగుతున్న హింసాకాండ‌పై ఆందోళ‌న‌

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఆ దేశ నేషనలిస్ట్‌ పార్టీ అధినేత్రి, మాజీ ప్రధాని ఖలీదా జియా ఆవేద‌న‌ వ్యక్తం చేశారు. మంగళవారం గృహనిర్బంధం నుంచి విడుదలైన ఖలీదా.. బంగ్లాదేశ్‌ ఖిలాఫత్‌ మజ్లీస్‌ ప్రధాన కార్యదర్శి మౌలానా మమునుల్ హక్‌తో భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా దేశ వనరులు వృథా అవుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్లు ఢాకా ట్రిబ్యూన్ వెల్ల‌డించింది. మన దేశ‌ వనరులు వృథా అవుతున్నాయి. ‘ఈ దేశం మనది, ఈ దేశాన్ని మనం నిర్మించుకోవాలి’ అని ఆమె అన్నారు. 

దేశాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజల ప్రాణాలకు హాని తలపెట్టడమే కాకుండా ఆస్తులను ధ్వంసం చేయటం తీవ్రమైన విషయమని ఖలీదా జియా పేర్కొన్నారు. దేశ వనరులను కొల్లగొట్టడంలో చాలా మంది ప్రమేయం ఉంద‌ని, ఇది అన్యాయమని ఆమె పేర్కొన్న‌ట్లు ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది.

కాగా, ఆగస్టు 6న బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహబుద్దీన్ అహ్మద్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 49 ప్రకారం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా జైలు శిక్షను తగ్గించి, విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఆమె నిన్న విడుద‌లైన త‌ర్వాత‌ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 

ఆమె మౌలానా మామునుల్ హక్ తండ్రి దివంగత షేఖుల్ హదీస్ అజీజుల్ హక్‌తో తనకున్న మంచి సంబంధాన్ని గుర్తుచేసుకున్నారని ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు హాని కలిగించడం తీవ్రమైన సంఘటన అని ఖలీదా జియా పేర్కొన్నారు.

Related posts

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో మరోసారి ఉద్యోగాల కోత..!

Ram Narayana

లండన్ ఆసుపత్రిలో పసికందులను చంపేస్తున్న నర్సును పట్టిచ్చిన భారత సంతతి వైద్యుడు

Ram Narayana

చంద్రుడి పై సేల్ …భూమి కొనుగోలు చేసి ఆనంద పడుతున్న భూమండల వాసులు …

Ram Narayana

Leave a Comment