Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు అధికారులు …

అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు అధికారులు …

అమెరికాలోని డల్లాస్ లో ఉన్న జాతిపిత మహాత్మగాంధీ మెమోరియల్ ను సందర్శించి
నివాళి అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన
ఇప్పటివరకు (ఆగస్ట్ 8 వరకు) కుదిరిన ఒప్పందాలు

  1. కాగ్నిజెంట్:
    అమెరికా తర్వాత హైదరాబాద్‌లో అతి పెద్ద క్యాంపస్. దాదాపు 15,000 ఉద్యోగాలు.
  2. వాల్ష్ కార్రా హోల్డింగ్స్:
    WE-హబ్ లో 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు. అభివృద్ది చెందుతున్న తెలంగాణ స్టార్టప్‌లలో 100 మిలియన్ల పెట్టుబడి.
  3. ఆర్సీసియం:
    దాదాపు 500 హై-ఎండ్ టెక్ ఉద్యోగాలు.
  4. స్వచ్ఛ్ బయో:
    రూ.1000 కోట్ల పెట్టుబడులు. 500 మందికి ఉద్యోగాలు.
  5. ట్రైజిన్ టెక్నాలజీస్:
    హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ డెవెలప్మెంట్, డెలివరీ సెంటర్. దాదాపు 1000 ఉద్యోగాలు.
  6. హెచ్​సీఏ హెల్త్ కేర్:
    నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ విస్తరణ.
  7. కార్నింగ్:
    గ్లాస్ ట్యూబింగ్ ఫెసిలిటీ కేంద్రంలో వచ్చే ఏడాదిలో (2025) వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం.
  8. వరల్డ్ బ్యాంక్:
    తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం, సహకారం.
  9. వివింట్ ఫార్మా:
    రూ.400 కోట్ల పెట్టుబడి, దాదాపు1000 మందికి ఉద్యోగాలు.
  10. చార్లెస్ స్క్వాబ్:
    హైదరాబాద్ లో భారతదేశంలోనే మొదటి టెక్నాలజీ డెవెలప్మెంట్ సెంటర్.

ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డల్లాస్ లో కలిసిన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన పామాయిల్ రైతు, ఆయిల్ పామ్ తెలంగాణరాష్ట్ర అడ్వయిజరీకమిటీ సభ్యులు వల్లూరి కృష్ణారెడ్డి..

రుణమాఫీ అభినందనీయమని, కానీ 2018 డిసెంబర్ 12వతేదీ కి ముందు అప్పుతీసుకొని రెన్యూవల్ చేయించుకున్న రైతులకు వర్తింపచేసినట్లయితే మరింత ఉపయోగకరంగా ఉంటుందని కృష్ణారెడ్డి సూచించారు.

లేనట్లయితే 2018కి ముందు తీసుకుని, లోన్ కడుతూ రెన్యువల్ చేయించుకుంటూ వస్తున్న రైతులకు రుణమాఫీ అందే అవకాశం ఉండదని, ఈ..అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్ధించారు. ఈ..వివరాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వల్లూరి కృష్ణారెడ్డి వినతిపత్రం అందజేశారు.

Related posts

బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణమన్న కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన హరీశ్ రావు

Drukpadam

రుణమాఫీపై ప్రతిపక్షాలు బురదజల్లడం మానుకోవాలి …మంత్రి తుమ్మల

Ram Narayana

ఈనెల 22 న ఢిల్లీలో పొంగులేటి ,జూపల్లి రాహుల్ గాంధీతో భేటీ !

Drukpadam

Leave a Comment