Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

నిప్పు అంటుకుందనుకుని.. రైల్లోంచి దూకేసిన ప్రయాణికులు…

  • రైల్లో అగ్నిమాపక పరికరాన్ని వాడిన ఆకతాయిలు
  • ఆ పొగలను చూసి అగ్నిప్రమాదం జరిగి ఉంటుందనే ఆందోళన
  • భయంతో కదులుతున్న రైల్లోంచి దూకేసిన కొందరు

కొందరు ఆకతాయిలు చేసిన పనితో రైలుకు నిప్పు అంటుకుని ఉంటుందని భయపడి కొందరు ప్రయాణికులు కదులుతున్న రైలులోంచి కిందికి దూకేశారు. అందులో 12 మందికి గాయాలయ్యాయి. ఉత్తర ప్రదేశ్ లోని బిల్ పూర్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. 
అగ్నిమాపక పరికరంతో..
హావ్‌డా- అమృత్‌సర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బిల్‌ పూర్ స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో.. కొందరు ఆకతాయిలు అగ్నిమాపక పరికరాన్ని తీసి స్ప్రే చేశారు. దాంతో పొగలు రావడంతో.. రైలులో మంటలు చెలరేగి ఉంటాయనే ఆందోళన మొదలైంది. కొందరు ప్రయాణికులు భయంతో అత్యవసర బ్రేక్ చైన్ లాగారు. కానీ రైలు ఆగేలోపే భయంతో కొందరు ప్రయాణికులు కిందికి దూకేశారు.
12 మందికి గాయాలు
రైలు లోంచి కిందికి దూకినవారిలో 12 మందికి గాయాలైనట్టు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. నిజానికి అప్పటికే రైలు వేగం బాగా తగ్గిందని.. లేకుంటే క్షతగాత్రుల సంఖ్య పెరిగి ఉండేదని పేర్కొన్నారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

Related posts

ఓటర్ నమోదుకు ఆధార్ తప్పనిసరి కాదని స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Ram Narayana

దేశంలోనే ధనిక రాష్ట్రాలు.. ఏపీ స్థానం ఎక్కడ?

Ram Narayana

సీఎం పదవి కోసం మా ఇద్దరి మధ్య పోటీ ఉంటే తప్పేంటి?: సిద్ధరామయ్య

Drukpadam

Leave a Comment