Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

మాచ‌ర్ల‌లో వైసీపీకి ఎదురుదెబ్బ‌!

  • మాచ‌ర్ల‌ మున్సిపాలిటీలో పట్టుబిగిస్తున్న టీడీపీ 
  • ఇప్ప‌టికే టీడీపీలోకి 14 మంది వైసీపీ కౌన్సిల‌ర్లు 
  • ఇప్పుడు ఛైర్మ‌న్ ఏసోబు, వైస్ ఛైర్మ‌న్ న‌ర‌సింహారావు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం
  • తాజాగా స్థానిక ఎమ్మెల్యే బ్ర‌హ్మారెడ్డితో ఛైర్మ‌న్, వైస్ ఛైర్మ‌న్ భేటీ

ప‌ల్నాడు జిల్లాలోని మాచ‌ర్లలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. మాచ‌ర్ల‌ మున్సిపాలిటీలో టీడీపీ పట్టుబిగిస్తోంది. ఇప్ప‌టికే 14 మంది వైసీపీ కౌన్సిల‌ర్లు టీడీపీలో చేరారు. ఇప్పుడు మున్సిప‌ల్ ఛైర్మ‌న్ చిన్న ఏసోబు, వైస్ ఛైర్మ‌న్ న‌ర‌సింహారావు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న‌ట్లు తెలుస్తోంది. 

గురువారం వారు స్థానిక ఎమ్మెల్యే జూల‌కంటి బ్ర‌హ్మారెడ్డితో స‌మావేశ‌మ‌య్యారు. ఆయ‌న‌తో చ‌ర్చ‌లు స‌ఫ‌లం కావ‌డంతో శ‌నివారం వారు టీడీపీ కండువా క‌ప్పుకునేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. ఇక మాచ‌ర్ల‌లో మొత్తం 31 వార్డులుండ‌గా, 2022లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అన్ని వార్డుల్లో ఏకగ్రీవాలతో  వైసీపీ విజయం సాధించింది. 

ఇప్పుడు రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటు కావ‌డంతో మాచ‌ర్ల‌లో రాజ‌కీయం మారింది. కౌన్సిల‌ర్లు ఒక్కొక్క‌రు టీడీపీలో చేరుతున్నారు. ఇప్ప‌టికే 14 మంది టీడీపీ తీర్థం పుచ్చుకోగా.. ఇప్పుడు ఛైర్మ‌న్‌, వైస్ ఛైర్మ‌న్ కూడా చేరితే టీడీపీ బలం 16కు చేర‌నుంది.

బాలయ్య ఇలాకాలో వైసీపీకి భారీ షాక్

Big shock to YSRCP in Balakrishna constituency Hindupur
  • వైసీపీకి మున్సిపల్ ఛైర్మన్ సహా మరో 8 మంది కౌన్సిలర్ల రాజీనామా
  • బాలయ్య సమక్షంలో టీడీపీలో చేరిక
  • మరొక్కరు చేరితే హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ వశం

అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందనే చెప్పుకోవాలి. వైసీపీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఆ పార్టీకి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. పలు చోట్ల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా… బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో కూడా వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీకి చెందిన హిందూపురం మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజతో పాటు ఎనిమిది మంది కౌన్సిలర్లు టీడీపీ గూటికి చేరారు. హిందూపురంలోని బాలకృష్ణ నివాసంలో ఆయన సమక్షంలో వీరంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.   

ఈ సందర్భంగా ఇంద్రజ మాట్లాడుతూ, నియోజకవర్గాన్ని బాలకృష్ణ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో టీడీపీలో చేరామని చెప్పారు. మరోవైపు హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 30 మంది వైసీపీ, ఆరుగురు టీడీపీ, బీజేపీ, ఎంఐఎం తరపున ఒక్కొక్కరు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి ఇద్దరు, ఎంఐఎం కౌన్సిలర్ టీడీపీలో చేరారు. ఇప్పుడు మరో 9 మంది చేరడంతో టీడీపీ బలం 19కి చేరింది. మరొక్కరు చేరితే మున్సిపాలిటీ టీడీపీ వశం అవుతుంది. ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్లు కలుపుకుంటే టీడీపీ బలం 21కి చేరుతుంది. మరికొందరు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

Related posts

బాలకృష్ణకు ఎక్స్ వేదికగా అంబటి రాంబాబు కౌంటర్

Ram Narayana

బీజేపీ నుంచి ఫోన్ వచ్చింది… అందుకే…!: కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

పవన్ ఆదేశాలు… సరస్వతి పవర్ సంస్థ భూముల్లో అధికారుల సర్వే

Ram Narayana

Leave a Comment