Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

నాగార్జున సత్యహరిచంద్రుడు ఏమి కాదు …సిపిఐ నేత నారాయణ విసుర్లు

మాజీ మంత్రి మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చెరువును ఆక్రమించి కాలేజీలే కట్టారని అన్నారు సీపీఐ నేత నారాయణ.. సినీనటుడు నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలను పరిశీలించిన నారాయణ.నాగార్జున సత్య హరిశ్చంద్రుడేమీ కాదు..చెరువును ఆక్రమించిన యన్ కన్వెన్షన్ కట్టారన్నారు. ఎన్ కన్వెన్షన్ లో రోజు లక్ష రూపాయల ఆదాయం వస్తుందన్నారు. అక్రమ నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగ తిస్తున్నామన్నారు.

మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి చెరువులో కాలేజీలు కట్టారు..వారంతా కబ్జాకోరులు..ఫిరంగి నాళాలను కబ్జాచేసి ఇల్లు కట్టుకున్నారన్నారు. చెరువులు, నాళాలు కబ్జా అయితే ఊర్లు మునిగిపోతాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతను కొనసాగిస్తూ ఎక్కడ కబ్జా జరిగినా ఖాళీ చేయించాలన్నారు నారాయణ. ఎవరు కబ్జాలు చేసినా..దొంగ పట్టాలు పొందినా వారి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సీపీఐ నారాయణ అన్నారు. రాజకీయ కక్ష సాధింపు అవసరం లే దు..ఏపార్టీకి చెందిన అయినా ఆక్రమణలు చేస్తే..హైడ్రా కూల్చివేతలు చేపట్టాలన్నారు. అటువంటి నిర్మాణాలను అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్య లు తీసుకోవాలన్నారు.

రాజ్యాంగం , న్యాయం అందరికీ సమానమే.. ఏళ్ల తరబడి కేసులు నాన్చవద్దు..ఆక్రమణదారులు కోర్టుకు వెళితే తప్పు చేసినట్టే లెక్క అని సీపీఐ నేత నారాయణ అన్నారు.

మరోసారి చెబుతున్నా… ఎన్ కన్వెన్షన్ ను పట్టా భూమిలోనే నిర్మించాం: నాగార్జున

Nagarjuna reiterated that they built N Convention in patta land

ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత అంశంపై సినీ నటుడు అక్కినేని నాగార్జున మరోసారి స్పందించారు. తాము ఎలాంటి భూ ఆక్రమణలకు పాల్పడలేదని , అక్రమ నిర్మాణం చేపట్టలేని పునరుద్ఘాటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

“ప్రియమైన అభిమానులకు, శ్రేయోభిలాషులకు… సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలంటే చాలు… వాటికి అతిశయోక్తులు జోడిస్తుంటారు, మరింత ప్రభావంతంగా ఉండేందుకు ఊహాగానాలు ప్రచారం చేస్తారు. మరోసారి చెబుతున్నా… ఎన్ కన్వెన్షన్ ను పట్టా భూమిలోనే నిర్మించాం. అన్ని డాక్యుమెంట్లు ఉన్న భూమి అది. ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదు. 

తుమ్మిడికుంట చెరువులో ఎలాంటి భూ ఆక్రమణలు జరగలేదని ఏపీ భూ సేకరణ చట్టం స్పెషల్ కోర్టు 2014 ఫిబ్రవరి 24న తీర్పు (ఎస్సార్.3943/2011) వెలువరించింది. ఇప్పుడు హైకోర్టులో కూడా ప్రాథమిక వాదనలు వినిపించాం. 

నేను భూ చట్టానికి, తీర్పుకు కట్టుబడి ఉంటాను. అప్పటివరకు ఎలాంటి ఊహాగానాలు, పుకార్లు, వాస్తవాల వక్రీకరణ, తప్పుదారి పట్టించడం వంటి చర్యల జోలికి వెళ్లొద్దని మిమ్మల్నందరినీ హృదయపూర్వకంగా అర్థిస్తున్నాను” అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.

Related posts

ముగిసిన సింగరేణి ఎన్నికల పోలింగ్.. అర్ధరాత్రికి ఫలితాలు! 

Ram Narayana

విద్యుత్ వివాదం.. బీఆర్ఎస్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్…

Drukpadam

బీజేపీని వీడిన మాజీ మంత్రి చంద్రశేఖర్

Ram Narayana

Leave a Comment