వరద బాధితులను ఆదుకోండి …సీఎం రేవంత్ కు సిపిఎం వినతి
పూర్తిగా మునిగి దెబ్బతిన్న గృహాలకు మూడు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలి
వరదల్లో ప్రాణాలు కోల్పొయిన కుటుంబాలకు 20 లక్షలు ఇవ్వాలి
దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 20 ఇవ్వాలి
సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ
ఖమ్మం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు నగరాన్ని ముంచెత్తాయి. నగరంతో సహా జిల్లాలో సుమారు పదివేల కుటుంబాలు నష్టపోయాయి నగరంలో వేలాదిమంది గృహాలు పూర్తిగా మునిగిపోయి కట్టు బట్టలతో మిగిలినారు. మున్నేరు పరివాహక ప్రాంతంలో పంటలు దెబ్బతిన్నాయి. సర్వం కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాలని వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పూర్తిగా మునిగి దెబ్బతిన్న గృహాలకు మూడు లక్షల పరిహారం ఇవ్వాలని. పాక్షికంగా దెబ్బతిన్న గృహాలకు లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాలని.
వరదల్లో కొట్టుకుపోయి మరణించిన వారికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని.
దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 20,000 నష్టపరిహారం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు , జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.