Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్‌!

  • మంగ‌ళ‌గిరిలోని టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యంపై దాడి కేసు
  • హైదరాబాద్‌లో నందిగం సురేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • అరెస్టు భ‌యంతో అజ్ఞాతంలోకి వెళ్లిన‌ వైసీపీ నేత‌
  • సెల్‌ఫోన్ సిగ్న‌ల్స్ ఆధారంగా గుర్తించి, అరెస్ట్ చేసిన పోలీసులు

మంగ‌ళ‌గిరిలోని టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యంపై దాడి కేసులో వైసీపీ నేత‌, బాప‌ట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైద‌రాబాద్‌లో ఉన్న ఆయ‌న‌ను అరెస్ట్ చేసి ఏపీకి త‌ర‌లిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సురేశ్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టివేసిన విష‌యం తెలిసిందే. 

దీంతో తుళ్లూరు పోలీసులు బుధ‌వారం సురేశ్‌ను అరెస్ట్ చేసేందుకు ఉద్దండ‌రాయునిపాలెంలోని ఆయ‌న నివాసానికి వెళ్లారు. అయితే, అరెస్టుపై స‌మాచారంతో ఆయ‌న త‌న ఫోన్ స్విచాఫ్ చేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో పోలీసులు కొంత సేప‌టి వ‌ర‌కు వేచి చూసి అక్క‌డి నుంచి వ‌చ్చేశారు.

ఆ త‌ర్వాత సెల్‌ఫోన్ సిగ్న‌ల్స్ ఆధారంగా సురేశ్ బుధ‌వారం ఉద‌యం నుంచి ఎక్క‌డ ఉన్నారో పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. దాంతో పోలీసులకు ఆయ‌న హైద‌రాబాద్ నుంచి పారిపోయేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిసింది. వెంట‌నే హైద‌రాబాద్ వెళ్లిన ప్ర‌త్యేక బృందం సురేశ్‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం. 

కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేత‌లు దేవినేని అవినాశ్‌, లేళ్ల అప్పిరెడ్డి, త‌లశిల ర‌ఘురామ్ త‌దిత‌రులు అంద‌రూ అజ్ఞాతంలోకి వెళ్లిపోవ‌డంతో గుంటూరు, బాప‌ట్ల‌, ప‌న్నాడుకు చెందిన 12 పోలీసు బృందాలు వారి కోసం వెతుకుతున్నాయి.

Related posts

బాలికపై చిరుత దాడి చేసిన ప్రదేశాన్ని పరిశీలించిన టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

Ram Narayana

చీతాల సంర‌క్ష‌ణ‌లో రాజీ ప‌డొద్దు… కునో పార్క్ సిబ్బందికి మోదీ దిశానిర్దేశం

Drukpadam

కోర్టు ఆదేశాల పట్ల గౌరవం లేదా?: ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు!

Drukpadam

Leave a Comment