Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు 100 రోజుల పాలన అంతా మోసం మోసం …మాజీ సీఎం జగన్

చంద్రబాబు 100 అంతా మోసం మోసం చెప్పిన వాగ్దానాలు అములు లేదు …”సూపర్ సిక్స్ లేదు… సెవెనూ లేదు. గోరుముద్ద ,వసతి దీవెన అటుకెక్కాయి …వ్యవస్థలన్నీ తిరోగమనంలో ఉన్నాయి ..అందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇలా చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తారు …శుక్రవారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రజాసమస్యలను పక్కదార్లు పట్టించేందుకే కొత్త కొత్త ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు …ఆయన మోసాల గురించి ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని అన్నారు ..ఆయన మోసాలు వెల్లకాలం సాగవని హెచ్చరించారు …

“సూపర్ సిక్స్ లేదు… సెవెనూ లేదు. వ్యవస్థలన్నీ తిరోగమనంలో ఉన్నాయి. గోరు ముద్ద గాలికి ఎగిరిపోయింది. ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు వసతి దీవెన, విద్యా దీవెన కూడా ఇవ్వలేదు. 108, 104 ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదు. డైవర్షన్ పాలిటిక్స్‌లో చంద్రబాబు దిట్ట. వరదలు వస్తాయని అప్రమత్తత ఉన్నా రివ్యూ చేయలేదు’’ అని జగన్ ఆరోపించారు.

తిరుపతి లడ్డు పై చంద్రబాబువి కట్టు కథలు

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందనేది ఒక కట్టు కథ అని కొట్టిపారేశారు. దశాబ్దాలుగా జరుగుతున్న పద్దతుల్లోనే తిరుమలలో లడ్డూ తయారీ జరుగుతోందని అన్నారు.

దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుది అని విమర్శించారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? అని ఆయన ప్రశ్నించారు.

ప్రతి 6 నెలలకు ఒకసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారని, జులై 23న రిపోర్ట్ వస్తే ఇప్పుడు చంద్రబాబు మాట్లాడడం విడ్డూరం అని మండిపడ్డారు.

ఎప్పటిలాగా ఒకే విధానంలో లడ్డూ తయారీ సామగ్రి కొనుగోలు ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్ష విధానాలను ఎవరూ మార్చలేదని, ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా అని అన్నారు. ఒక సీఎం ఇలా అబద్ధాలు ఆడటం ధర్మామేనా అని జగన్ మండిపడ్డారు.

జులై 17న ఎన్‌డీడీబీకి నెయ్యి శాంపిల్స్ పంపించారని, జులై 23న రిజెక్ట్ చేస్తే చంద్రబాబు ఇప్పటివరకు ఏం చేశారు?. ఎందుకు బయటకు చెప్పలేదని ప్రశ్నించారు. జరగనిది జరిగినట్టు చంద్రబాబు చెబుతున్నారని జగన్ పేర్కొన్నారు. నెయ్యి తీసుకొచ్చే ప్రతి ట్యాంకర్ సర్టిఫికెట్ తీసుకోవాలని, ప్రతి ట్యాంక్ శాంపిళ్లను మూడుసార్లు టెస్ట్ చేస్తారని వివరించారు.

అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. మన తిరుమలను మనమే తక్కువ చేసుకుంటున్నామని అన్నారు. లడ్డూ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీకి, సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తానని అన్నారు. 100 రోజుల పాలనపై ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ వ్యవహారం అని అన్నారు.

అంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి ఎలా ఇస్తారు? – ఆ ఒక్క సంస్థ వల్లే కల్తీ..!!
నెయ్యిలో కొవ్వు కలిసింది..!!!
టీటీడీ ఈవో శ్యామలరావు*

లడ్డూ నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. లడ్డూ నాణ్యతపై పోటు సిబ్బందితో మాట్లాడానని, వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. లడ్డూ నాణ్యతగా ఉండాలంటే నెయ్యి నాణ్యంగా ఉండాలని చెప్పారని వివరించారు. నెయ్యి నాసిరకంగా ఉందని గుత్తేదారుకు చెప్పామని, నెయ్యిలో నాణ్యతా లోపాన్ని తాను కూడా గమనించినట్లు తెలిపారు. నెయ్యి నాణ్యత నిర్ధరణకు టీటీడీకి సొంత ప్రయోగశాల లేదని వ్యాఖ్యానించారు. నెయ్యి నాణ్యతపై అధికారులు గతంలో పరీక్షలు చేయలేదని తెలిపారు.
నాణ్యత నిర్ధారణకు బయట ల్యాబ్స్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. రూ.320 నుంచి రూ.411కే కిలో నెయ్యి సరఫరా చేశారని తెలిపారు. నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయలేరన్నారు. అంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తాము హెచ్చరించిన తర్వాత గుత్తేదారులు నాణ్యత పెంచారని పేర్కొన్నారు. 4 ట్యాంకర్లలోని నెయ్యిని 10 ప్రయోగ శాలలకు పంపామని తెలిపారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ కోసం ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు పంపినట్లు వివరించారు. ఎన్‌డీడీబీ ల్యాబ్‌ అనేది చాలా ప్రముఖమైనదని, అది గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉందని తెలిపారు.

నెయ్యి నాణ్యత 20పాయింట్లే !!
ల్యాబ్‌ పరీక్షల్లోనే నెయ్యి నాణ్యత లేదని తేలిందని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. జులై 6న నెయ్యిని ప్రయోగ శాలలకు పంపామని, వారంలో ల్యాబ్‌ నివేదికలు వచ్చాయని వెల్లడించారు. ల్యాబ్‌ రిపోర్టు రెండు విభాగాలుగా ఇచ్చారని, నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు నివేదికలు తేల్చాయని స్పష్టం చేశారు. 100 పాయింట్లు ఉండాల్సిన నెయ్యి నాణ్యత 20 పాయింట్లే ఉందని తెలిపారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు ఎన్‌డీడీబీ తేల్చిందని. అన్నారు. నెయ్యిలో తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే చర్యలు చేపట్టామని చెప్పారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ కూడా వేశామని వెల్లడించారు. నెయ్యి నాణ్యత పరికరాలను ఎన్‌డీడీబీ విరాళంగా ఇచ్చిందని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. సుమారు రూ.75 లక్షల విలువైన పరికరాలను ఎన్‌డీడీబీ విరాళంగా ఇచ్చిందని తెలిపారు. తమిళనాడుకు చెందిన ఏఆర్‌ ఫుడ్స్‌ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ ఉందని పేర్కొన్నారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సంస్థలు మొత్తం ఐదు ఉన్నాయని, అందులో ఒక్క ఏఆర్‌ ఫుడ్స్‌ సంస్థతోనే ఇబ్బందులని ఈవో శ్యామలరావు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

Related posts

ఇచ్చిన మాట ప్రకారం ‘పెద్దమ్మాకు సెల్ ఫోన్ పంపిన సీఎం జగన్!

Drukpadam

స్విమ్మర్ పై దాడి చేసి చంపేసిన షార్క్ చేప.. సిడ్నీలో బీచ్ ల మూసివేత!

Drukpadam

భారీ చెట్టును కొట్టేయ‌కుండానే ఇల్లు క‌ట్టుకున్న వ్య‌క్తి.. 

Drukpadam

Leave a Comment