Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా… తాట తీస్తా!: చంద్రబాబు వార్నింగ్

  • ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
  • రచ్చబండకు హాజరైన సీఎం చంద్రబాబు
  • ఊరికొక సైకో తయారయ్యాడని విమర్శలు
  • ఈ సైకోలకు ప్రభుత్వం అంటే లెక్కలేనితనం అని ఆగ్రహం

ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి శిష్యులు కొందరు తయారయ్యారని విమర్శించారు. ఊరికొక సైకో తయారయ్యారు.. ఆ సైకోలకు ప్రభుత్వం అంటే లెక్కలేని తనం వచ్చిందని మండిపడ్డారు. 

ఎదురుదాడి చేస్తే భయపడిపోతాం అనుకుంటున్నారు… ఎదురుదాడి చేస్తే నేను భయపడే రకం కాదు… తప్పు చేసిన వాళ్ల తాట తీస్తా అని ఘాటుగా హెచ్చరించారు. 

ఇవాళ తాను ప్రజలను చూడ్డానికే మద్దిరాలపాడు వచ్చానని, హంగు ఆర్భాటాల కోసం కాదని అన్నారు. 

“నేను 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను. అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఎన్ని ఆర్భాటాలు చేస్తే ఏమొస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా. 

కానీ నేను కోరుకునేది ఒక్కటే… నేను చేసే ప్రతి పని వల్ల అనుక్షణం మీ జీవితాల్లో వెలుగు రావాలి, మార్పు రావాలి… అందుకోసమే నేను పాటుపడుతున్నా. ఇప్పుడు కూటమి పాలనకు 100 రోజులు పూర్తయింది. నా అనుభవాన్ని గుర్తించి, చరిత్రలో ఎన్నడూ లేనంతగా 93 శాతం స్థానాల్లో మమ్మల్ని గెలిపించారు. 

శ్రీకాకుళం నుంచి జైత్రయాత్ర మొదలైంది. కానీ ప్రకాశం జిల్లాల్లో రెండు చోట్ల బ్రేక్ పడింది. దర్శి, యర్రగొండపాలెంలో ఓడిపోయాం. ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియాలోనూ అరకు, పాడేరులో ఓటమిపాలయ్యాం. మిగతాచోట్ల అత్యధిక స్థానాల్లో మేం గెలిచామంటే అందుకు కారణం ప్రజలు చూపిన అభిమానమే. ఇది నా జీవితంలో మర్చిపోలేను. 

భవిష్యత్తు బాగుండాలని మీరంతా ఓట్లేశారు. కానీ రాష్ట్రం పరిస్థితి చూస్తే వెంటిలేటర్ పై ఉంది. ఆక్సిజన్ తీసేస్తే ప్రాణం పోయే పరిస్థితి! అయితే, మీరందరూ ఒక మంచి పని చేశారు. కూటమి నుంచి 21 మంది ఎంపీలను గెలిపించారు. దాని వల్ల ఢిల్లీలో మన పరపతి పెరిగింది. కాబట్టి ఇవాళ రాష్ట్రానికి ఆక్సిజన్ తీసుకొస్తున్నా. కేంద్రం నుంచి మనకు సహకారం అందకపోతే నేను ఎన్ని మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఇదంతా సాధ్యమైంది మీ చొరవ వల్లే. ఆ చొరవే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టింది” అని చంద్రబాబు వివరించారు.

Related posts

త్వరలోనే జిల్లాలవారీగా అందరినీ కలుస్తాను: పవన్ కల్యాణ్

Ram Narayana

నేను జగన్ కు సహాయం చేశా… కానీ ఆయన నుంచి నేనెప్పుడూ సాయం అందుకోలేదు: రఘురామ

Ram Narayana

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. హాజరుకావడంపై నేడు టీడీపీ నిర్ణయం

Ram Narayana

Leave a Comment