- కాల్పుల్లో ఎమ్మెల్యే అనుచరుడికి గాయాలు
- ముఠా తగాదాలుగా భావిస్తున్న పోలీసులు
- కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
హర్యానాలోని పంచకులలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరి కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. ఈ దాడి ఘటనలో ఎమ్మెల్యే అనుచరుడికి గాయాలయ్యాయి. అతనికి రెండు చోట్ల బుల్లెట్ గాయాలు అయ్యాయి. సదరు అనుచరుడికి నేర కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కాల్పుల వెనుక ముఠా తాగాదాలు ఉండవచ్చునని ప్రాథమికంగా భావిస్తున్నారు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
అక్టోబర్ నెలలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ కాల్పులు జరిపారు. కాల్పుల విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బుల్లెట్ గాయాలైన అనుచరుడిని చికిత్స నిమిత్తం చండీగఢ్‌లోని పీజీఐ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.