Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వంగవీటి రాధాకు స్వల్ప గుండెపోటు…

  • తెల్లవారుజామున ఛాతీలో నొప్పితో బాధపడ్డ వంగవీటి రాధ
  • హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
  • ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వైద్యులు

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. ఈ తెల్లవారుజామున ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో, కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 

రాధా ఆరోగ్యం గురించి డాక్టర్లు స్పందిస్తూ… ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 48 గంటల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. మరోవైపు రాధా గుండెపోటుకు గురయ్యారనే వార్తతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. పలువురు ఆయన ఇంటి వద్దకు వెళ్లి వివరాలను కనుక్కుంటున్నారు. రాజకీయ నాయకులు కూడా రాధా ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. రాధా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Related posts

ఖమ్మం కు యూనివర్సిటీ ఇవ్వండి …సీఎం కు సీఎల్పీ నేత భట్టి విజ్ఞప్తి!

Drukpadam

యాదాద్రికి సత్వరమే పర్యావరణ అనుమతులు ఇవ్వాలి…నామ

Drukpadam

కుంభమేళాకు 28 లక్షల మంది భక్తులు…

Drukpadam

Leave a Comment