Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

పెట్టుబడుల ఆకర్షణ కోసం జపాన్ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జపాన్ లో పర్యటిస్తున్నారు. వారం రోజుల అమెరికా పర్యటన తర్వాత జపాన్ కు చేరుకున్నారు భట్టి. హానిడ ఎయిర్ పోర్టులో భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు భట్టికి స్వాగతం పలికారు.

తెలంగాణలో పెట్టుబడులు ఆహ్వానించేందుకు పలు కంపెనీలతో మంతనాలు జరపనున్నారు డిప్యూటీ సీఎం. ఆయనతో పాటు ఆర్థిక, ఇంధన శాఖల అధికారులు, సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ఉన్నారు.మొదటి రోజు పెట్టుబడులకు ముందుకు వచ్చే కంపెనీలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు భట్టి. సాయంత్రం యమాంషి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ సందర్శనలో భాగంగా అధికారులతో కలిసి హాజరుకానున్నారు. రెండో రోజు తోషిబా, కవాసాకి, యాక్లహామ పరిశ్రమలను సందర్శించనున్నారు డిప్యూటీ సీఎం. అదే రోజు రాత్రి ఒకాసకు చేరుకోనున్నారు. మూడో రోజున పానాసోనిక్ హెడ్ క్వార్టర్స్ ను అధికారులతో సందర్శించనున్నారు డిప్యూటీ సీఎం భట్టి. మూడు రోజుల పర్యటన ముగించుకుని రాష్ట్ర బృందం తిరిగి నాలుగో రోజు హైదరాబాద్ కు చేరుకోనుంది.

Related posts

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ టికెట్స్ ఆశిస్తున్నవారి జాబితా …!

Drukpadam

భవిష్యత్తు పోరాటాల ను నిర్దేశించనున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు..

Ram Narayana

మంత్రి సీతక్కతో స్మిత సబర్వాల్ భేటీ.. ఫొటోలు ఇవిగో!

Ram Narayana

Leave a Comment