Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

ఎగ్జిట్ పోల్స్ వ్యవస్థ సిగ్గుపడేలా హర్యానా ట్రెండ్స్ ఉన్నాయి: శశి థరూర్

  • హర్యానాలో ఊహించని విధంగా లీడ్ లోకి వచ్చిన బీజేపీ
  • ఎన్నికల ఫలితాల చివరి వరకు వేచి చూద్దామన్న శశి థరూర్
  • బీజేపీ లీడ్ లోకి రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వ్యాఖ్య

హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఘన విజయం దిశగా సాగుతోంది. మొత్తం 90 సీట్లకు గాను కూటమి 52 స్థానాల్లో లీడ్ లో ఉండగా… బీజేపీ 27 స్థానాల్లో ముందంజలో ఉంది. 

హర్యానాలో ఎర్లీ ట్రెండ్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చినప్పటికీ… ఆ తర్వాత పరిణామాలు ఊహించని విధంగా మారిపోయాయి. బీజేపీ మ్యాజక్ ఫిగర్ ను దాటి లీడ్ లోకి వచ్చింది. ప్రస్తుతం హర్యానాలో మొత్తం 90 స్థానాలకు గాను 49 స్థానాల్లో బీజేపీ లీడ్ లో ఉండగా… కాంగ్రెస్ 34 స్థానాల్లో ఆధిక్యతను కనపరుస్తోంది. హర్యానాలో బీజేపీ గెలుపు ఖాయమనే అంచనాలు పెరుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత శశి థరూర్ మాట్లాడుతూ… హర్యానాలో బీజేపీ లీడ్ లోకి రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. ఇప్పటికిప్పుడే ఎన్నికల ఫలితాలపై ఒక అంచనాకు రావద్దని… వేచిచూద్దామని చెప్పారు. హర్యానా ట్రెండ్స్… మొత్తం ఎగ్జిట్ పోల్స్ వ్యవస్థ సిగ్గుపడేలా ఉన్నాయని తెలిపారు. పూర్తి ఫలితాలు వెలువడేంత వరకు మనం వేచి చూద్దామని అన్నారు. హర్యానా ఫలితాలపై తాము ఎన్నో అంచనాలు పెట్టుకున్నామని… అయితే, తాము ఊహించిన విధంగా లేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. జమ్మూకశ్మీర్ కన్నా హర్యానాలో ఇండియా బ్లాక్ మెరుగైన స్థితిలో ఉంటుందని భావించామని అన్నారు.

Related posts

మోదీ, అమిత్ షా నాతో ఫోన్ లో మాట్లాడారు: ఏక్ నాథ్ షిండే

Ram Narayana

ఎన్నికల్లో పరాభవం.. కాంగ్రెస్ హర్యానా ఇన్‌చార్జ్ రాజీనామా!

Ram Narayana

ప్రధాని మోదీపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ… ఎందుకంటే…!

Ram Narayana

Leave a Comment