Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎంటర్టైన్మెంట్ వార్తలు

16 రోజుల దేవర వసూళ్లను అధికారికంగా ప్రకటించిన మేకర్స్‌!

  • 16 రోజుల్లో 509 కోట్లు కలెక్ట్‌ చేసినట్లుగా అఫీషియల్‌ ప్రకటన 
  • బాక్సాఫీస్‌ కలెక్షన్లతో  పోస్టర్‌ విడుదల 
  • ఆనందంలో ఎన్టీఆర్‌ అభిమానులు

ఎన్టీఆర్‌, కొరటాల శివ కలయికలో రూపొందిన చిత్రం ‘దేవర’. జనతా గ్యారేజ్‌ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తరువాత ఈ క్రేజీ కాంబినేషన్‌ దేవర కోసం మరోసారి జతకట్టారు. ప్రముఖ కథానాయిక స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. సెప్టెంబర్‌  27న ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవర ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా దూసుకుపోతోంది. 

మంచి వసూళ్లతో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటికీ షేర్‌లు రాబడుతూ వసూళ్ల విషయంలో సంతృప్తికరంగానే వుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వసూళ్లకు దసరా సెలవులు అడ్వాంటేజీగా నిలిచాయి. ఇక ఈ  చిత్రంలో దేవర, వర అనే రెండు పాత్రల్లో ద్విపాత్రాభినయంలో నటించిన ఎన్టీఆర్‌ నటనకు ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 

అయితే ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 16 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 509 కోట్ల రూపాయల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసినట్లుగా అఫీషియల్‌గా ఓ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఆచార్యతో అపజయాన్నిచూసిన కొరటాల శివకు దేవర మంచి కమ్‌బ్యాక్‌ ఫిలిమ్‌ అని చెప్పుకోవాలి. అంతేకాదు ఎన్టీఆర్‌-కొరటాల శివ జోడి చేసిన రెండు చిత్రాలు విజయవంతం కావడం కూడా ఎన్టీఆర్‌ అభిమానుల్లో మంచి సంతోషాన్ని నింపింది. 

Related posts

ప్రభాస్‌తో పుకార్లకు చెక్.. దుబాయ్ వ్యక్తిని పెళ్లాడబోతున్న అనుష్క?

Ram Narayana

4 రాష్ట్రాలు.. 5 రోజులు.. 1800 కిలోమీటర్లు.. పోలీసులకు దొరక్కుండా సాహిల్ పరుగులు…

Ram Narayana

బొగత జలపాతానికి పర్యాటకుల తాకిడి..

Ram Narayana

Leave a Comment