Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఫీజు రీయింబర్స్ మెంట్ పై కాలేజీల యాజమాన్యాల గగ్గోలు …ఫార్మసీ కాలేజీల మూత!

తెలంగాణ ఫార్మసీ కాలేజీల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో నిరసనలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే గురువారం నుంచి కాలేజీల్లో క్లాసుల బంద్‌ చేస్తున్నట్లు యాజమాన్యాల నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాదు.. వారం తర్వాత నిరవధిక బంద్‌కు వెళ్తామని ప్రకటించాయి. ఇప్పటికే డిగ్రీ, పీజీ కాలేజీల్లో క్లాసులు బంద్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు సుమారు రూ.6,000 కోట్లకు పైగా పేరుకుపోయినట్లు సమాచారం. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏళ్ల తరబడి నిధులు విడుదల చేయకపోవడంతో భారీగా బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. గత ఏడాది డిసెంబరు 7న కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆ ఫీజులను చెల్లించాల్సిందేనంటూ విద్యార్థులపై ఆయా కాలేజీలు ఒత్తిడి తెస్తున్నాయి.

ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు బుధవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన ఫీజురీయంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేసేలా చొరవ తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందించారు. వారి సమస్యలు విన్న కేటీఆర్ స్పందిస్తూ రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందన్నారు. గురుకుల భవనాలకు అద్దె చెల్లించడం లేదని, కాలేజీల యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, పీజీ ప్రైవేట్ కాలేజీలను నిరవధికంగా మూసివేయటంతో పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు చెల్లించకుండా పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేసే కాంగ్రెస్ సర్కార్ దగ్గర అద్దె, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు ఇవ్వటానికి పైసలు లేవా? అని నిలదీశారు. విద్యార్థులకు అన్యాయం చేస్తామంటే బీఆర్ఎస్ సహించదని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని, వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌లు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Related posts

ఎస్సీ వర్గీకరణ విషయంలో రేవంత్ రెడ్డి జాప్యం చేస్తున్నారు: మంద కృష్ణ మాదిగ

Ram Narayana

మహాత్మా గాంధీ అతి పెద్ద విగ్రహం హైద్రాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ..గున్న రాజేందర్ రెడ్డి హర్షం ..

Ram Narayana

Ram Narayana

Leave a Comment