Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

మోసం చేయడంలో రేవంత్ రెడ్డి ఘనుడు: మంద కృష్ణ మాదిగ

  • ఎస్సీ వర్గీకరణ అమలులో ఎందుకు జాప్యం చేస్తున్నారో చెప్పాలని నిలదీత
  • మాదిగ, ఉపకులాలు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పిలుపు
  • వర్గీకరణ విషయంలో ముందుంటామని చెప్పారని గుర్తు చేసిన మంద కృష్ణ

నమ్మించడంలో… మోసం చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఘనుడని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ అమలులో ఎందుకు జాప్యం చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మాదిగ, ఉపకులాలు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణను అమలు చేసే విషయంలో రాష్ట్రం ముందుంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కానీ అమలు విషయంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. వర్గీకరణపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మంద కృష్ణ డిమాండ్ చేశారు. 

వర్గీకరణ అమలులో పంజాబ్, తమిళనాడు మొదటి వరుసలో నిలిచాయని ప్రశంసించారు. అందరికంటే ముందే అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి మాత్రం పక్కన పెట్టేశారన్నారు.

Related posts

ఫైళ్ల మాయం కేసులో పోలీసుల ముందుకు తలసాని మాజీ ఓఎస్డీ

Ram Narayana

జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, భార్య నీలిమపై కేసు

Ram Narayana

సి జె ఐ డీవై చంద్రచూడ్‌ తో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వక భేటీ …!

Ram Narayana

Leave a Comment