Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

రేవంత్ రెడ్డి మూర్ఖ‌పు విధానాల వ‌ల్ల గాంధీ భ‌వ‌న్ వైపు ఎవరూ చూడటం లేదు: కేటీఆర్ విమర్శలు!

  • ముఖ్యమంత్రిని రైతులు తిట్టరాని తిట్లు తిట్టారన్న కేటీఆర్
  • ప్రజలు తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి బీఆర్ఎస్ భవన్‌కు క్యూ కడుతున్నారని వెల్లడి
  • తెలంగాణలో రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు జరుగుతున్నాయని ఆగ్రహం

రేవంత్ రెడ్డి మూర్ఖ‌పు విధానాల వ‌ల్ల గాంధీ భ‌వ‌న్ వైపు ఎవరూ చూడటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీజేపీ కార్యాలయం వైపు కూడా ఎవరూ వెళ్లడం లేదన్నారు. ప్రతి ఒక్కరూ చ‌లో తెలంగాణ భ‌వ‌న్ అంటూ ఇటువైపే వస్తున్నారని పేర్కొన్నారు. హైడ్రా బాధితులు చాలామంది వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రాజ్యాంగ వ్య‌తిరేక నిర్ణ‌యాలు జ‌రుగుతున్నాయ‌ని విమర్శించారు.

చిట్టినాయుడి పాలనలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ముఖ్యమంత్రిని రైతులు తిట్టరాని తిట్లు తిడుతున్నారని, ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇవ్వలేదని, బతుకమ్మ చీర ఇవ్వలేదని, రైతుబంధు, రైతు భరోసా లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి లోపభూయిష్ట విధానాలతో విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారన్నారు.

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ప్రతినిధులతో సమావేశం సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… పరీక్షలు రాస్తామో… రాయమో కూడా తెలియని పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి బీఆర్ఎస్ భవన్‌కు వరుస కడుతున్నారన్నారు. ఇండ్లు కూల్చేస్తున్నారని కొందరు, వేతనాలు రావడం లేదని ఇంకొందరు… ఇలా ఏ కష్టం వచ్చినా తమ కార్యాలయానికే వస్తున్నారని తెలిపారు.

దశాబ్దాల పాటు కొట్లాడితే… ఎన్నో ప్రాణత్యాగాలతో తెలంగాణ వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీళ్లు, నియామకాలు, నిధుల నినాదంతోనే పని చేశామని, నీళ్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం సంపూర్ణ విజయం సాధించిందని తెలిపారు. దశాబ్దాల కాలం నాటి తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు. తలసరి ఆదాయంలో 2014లో 14వ స్థానంలో ఉన్న తెలంగాణ పదేళ్ల కేసీఆర్ పాలనలో మొదటి స్థానానికి వచ్చిందన్నారు.

Related posts

నకిలీ విత్తనాల సరఫరా చేస్తే కఠిన చర్యలు …వ్యవసాయమంత్రి తుమ్మల

Ram Narayana

కామారెడ్డి నుంచే పోటీ చేస్తా.. ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ

Ram Narayana

సుంకిశాల ఎవరి పాపం …? డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

Leave a Comment