Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

రైతు భరోసాపై తుమ్మల నాగేశ్వరరావు చేతులెత్తేస్తున్నట్లుగా ఉంది … కేటీఆర్

  • చేతకానితనంతో రైతులను మోసం చేస్తామంటే ఊరుకునేది లేదన్న కేటీఆర్
  • వానాకాలం సీజన్‌లో రైతుబంధు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టారన్న కేటీఆర్
  • రైతుబంధును వాయిదా మీద వాయిదా వేస్తూ వచ్చారన్న కేటీఆర్

రైతు భరోసాను రేపో… మాపో ఇస్తామని ప్రభుత్వం ఇప్పటి వరకు చెబుతూ వచ్చిందని, కానీ ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు మాత్రం చేతులెత్తేస్తున్నట్లు ప్రకటించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. చేతకానితనంతో రైతులను మోసం చేస్తామంటే ఊరుకునేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. వానాకాలం సీజన్‌లో రైతుబంధును ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టారని, తద్వారా లక్షలాదిమంది రైతుల నోట్లో మట్టి కొట్టారన్నారు.

రైతుబంధు విషయంలో వాయిదా మీద వాయిదా వేస్తూ వచ్చిన ప్రభుత్వంపై అప్పుడే తమకు అనుమానం కలిగిందని తెలిపారు. సబ్ కమిటీ, గైడ్ లైన్స్ అంటూ పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడతామంటే రైతులు వదిలి పెట్టరన్నారు. ఎన్నో హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… గద్దెనెక్కాక రైతులను ఏడిపిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నదాతల ఉసురు తగులుతుందని కేటీఆర్ శాపనార్థాలు పెట్టారు. రైతుబంధు పేరుతో కేసీఆర్ రూ.10 వేలు ముష్టి వేస్తున్నాడని, తాము రూ.15 వేలు ఇస్తామన్న సిపాయి ఎక్కడకు పోయాడని ప్రశ్నించారు. 

హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టి… వారి జీవితాలను నాశనం చేసి… లక్షా యాభై వేల కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేయడానికి డబ్బులు ఉంటాయి కానీ… రైతులకు రూ.7,500 కోట్లు ఇవ్వడానికి లేవా? అని ప్రశ్నించారు. అబద్దాలతో అధికారంలోకి వచ్చి రైతులను గోస పెడుతున్నారన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించకుంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తారన్నారు.

Related posts

మైనంపల్లి బెదిరిస్తున్నారు.. నాపై కూడా దాడి జరుగుతుందని భయంగా ఉంది: మంత్రి మల్లారెడ్డి

Ram Narayana

రేవంత్ రెడ్డివి అన్నీ అబద్ధాలే … క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్ డిమాండ్

Ram Narayana

బీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ కసిరెడ్డి గుడ్‌బై… రెండ్రోజుల్లో కాంగ్రెస్ తీర్థం!

Ram Narayana

Leave a Comment