Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

పోలీసులు నేరస్తులకు ఫ్రెండ్లీ కాదు భాదితులకు ఫ్రెండ్లీగా ఉండాలి…రేవంత్ రెడ్డి

  • వీర‌మ‌ర‌ణం పొందిన పోలీసుల కుటుంబాల‌కు రూ.1కోటి న‌ష్ట‌ప‌రిహారం 
  • పోలీసు అమ‌ర‌వీరుల‌ సంస్మ‌ర‌ణ దినం సంద‌ర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌క‌ట‌న‌
  • ఎస్ఐ, సీఐ స్థాయి అధికారికి రూ. 1.25 కోట్ల ప‌రిహారం
  • డీఎస్‌పీ, అడిష‌న‌ల్ ఎస్‌పీ, ఎస్‌పీలు వీర‌మ‌ర‌ణం పొందితే రూ. 1.50కోట్లు
  • ఐపీఎస్‌ల‌కు రూ.2కోట్లు ప‌రిహారంగా ఇస్తామ‌న్న సీఎం

పోలీసులు నేరస్తులను ,నిందితులకు ఫ్రెండ్లీగా కాకుండా , భాదితులకు ఫ్రెండ్లీగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు …పోలీస్ అమర వీరుల దినోత్సవం సందర్భంగా హైద్రాబాద్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పోలీస్ సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందని చెపుతూనే పోలీసులు న్యాయం కోసం వచ్చిన భాదితుల పక్షాన నిలవాలన్నారు …అదే సందర్భంలో పేరు పలుకుబడి ఉన్నవారి పక్షాన కాకుండా నిజమైన భాదితులకు న్యాయం చేయాలనీ హితవు పలికారు …చాలా కేసుల్లో ఉన్నవాడికి న్యాయం లేనివాడికి అన్యాయం జరుగుతుందని ఒక అపవాదు ఉందని దాన్ని చెరిపేయాలని అన్నారు …న్యాయం చేసే దగ్గర తరతమ ,ఉన్నవాడు లేనివాడు ,పైరవీకారుడు ,అమాయకుడు మధ్య నిత్యం సంఘర్షణ జరుగుతుందని ఇది ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంటుందని అన్నారు …మనం మారాలి ప్రజలకు న్యాయం చేయాలి అని అన్నారు ..

ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసులపై వ‌రాల జ‌ల్లు కురిపించారు. వీర‌మ‌ర‌ణం పొందిన పోలీసుల కుటుంబాల‌కు రూ.1కోటి న‌ష్ట‌ప‌రిహారంగా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. 

గోషామహల్ అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద నివాళులు అర్పించిన త‌ర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా అమ‌ర‌వీరుల ఫ్యామిలీల‌కు ఇచ్చే న‌ష్ట‌ప‌రిహారంపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ వీర‌మ‌ర‌ణం పొందితే కోటి రూపాయ‌లు.. అదే ఎస్ఐ, సీఐ స్థాయి అధికారికి రూ. 1.25 కోట్లు ఇస్తామ‌న్నారు. 

ఇక డీఎస్‌పీ, అడిష‌న‌ల్ ఎస్‌పీ, ఎస్‌పీలు వీర‌మ‌ర‌ణం పొందితే రూ. 1.50కోట్లు, ఐపీఎస్‌ల‌కు రూ.2కోట్లు ప‌రిహారంగా ఇస్తామ‌ని తెలిపారు. అంతేగాక వారి కుటుంబంలో అర్హ‌త‌ను బ‌ట్టి గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ కూడా ఇస్తామ‌న్నారు. అలాగే శాశ్వ‌త అంగ‌వైక‌ల్యం పొందిన అధికారుల ర్యాంకు ఆధారంగా రూ.50ల‌క్ష‌ల వ‌ర‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇస్తామ‌ని వెల్ల‌డించారు.  

Related posts

మాజీ ఎంపీ వివేక్, ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలపై ఈడీ ప్రకటన

Ram Narayana

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పై శ్వేతపత్రం విడుదల చేయాలనీ క్యాబినెట్ నిర్ణయం…రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీధర్ బాబు

Ram Narayana

కామారెడ్డి జిల్లాలో విషాదం …ఇద్దరు పిల్లలు తండ్రి బావుల్లో దూకి మృతి

Ram Narayana

Leave a Comment