రైతులకు అన్యాయం జరక్కుండా రైల్వే లైన్ నిర్మాణం జరగాలి ..ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి
డోర్నకల్ -మిర్యాలగూడెం రైల్వే లైన్ నిర్మాణం పై అధికారులకు తన వాదనలు గట్టిగ వినిపించిన ఎంపీ
ఇప్పటికే జాతీయరహదారులకు భూములు పోగుట్టుకుని రైతులు నష్టపోయారు ..
సీతారామ ప్రాజెక్ట్ కు భూములు ఇచ్చారు
తక్కువ నష్టం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి
కేంద్రం నిర్మించతలపెట్టిన డోర్నకల్ -మిర్యాలగూడెం రైల్వే లైన్ నిర్మాణం రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి రైల్వే ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు …గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో జరిగిన తెలంగాణ ఎంపీ ల సమావేశంలో రఘురామిరెడ్డి పాల్గొని తన నియోజకవర్గమైన ఖమ్మం రైతులకు జరుగుతున్నా నష్టాన్ని ప్రత్యాన్మయం మార్గాలను అధికారులకు వివరించారు ..
ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రతిపాదించిన డోర్నకల్ టు మిర్యాలగూడ రైల్వే లైన్ మరియు డోర్నకల్ టు గద్వాల రైల్వే లైన్ ఖమ్మం జిల్లా ప్రజలకి మరి ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల రైతులకు అన్యాయం జరుగుతుంది అని వాదించారు. ఈ ప్రాంత రైతులు ఇప్పటికే ఖమ్మం జిల్లా చుట్టుపక్కల ఉన్న జాతీయ రహదారులు 365a 365 బి మరియు నాగపూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే సీతారామ లెఫ్ట్ కెనాల్ భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ లాంటి ప్రాజెక్టులకు తమ భూమిని దారా దత్తం చేశారు . డోర్నకల్ టు విజయవాడ 3వ రైల్వే లైన్ కూడా ప్రారంభమైంది .దీనికి తోడుగా డోర్నకల్ టు మిర్యాలగూడ వయా పాపటపల్లి రైల్వే లైన్ అవసరం ఇంతవరకు ఉపయోగపడుతుంది అని సమీక్షించాల్సిందిగా కోరారు, ఈ రైల్వే లైన్ వల్ల పేద మధ్యతరగతి సన్నకారు రైతులు తమ భూమిని కోల్పోవడం తప్ప గొప్పగా ప్రయోజనం లేదని ప్రజలు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదిత రైల్వే లైన్ అవసరం ఉన్న డోర్నకల్ ,మన్నెగూడెం, అబ్బాయి పాలెం,మరిపెడ మోతే ద్వారా విష్ణుపురం అనగా మిర్యాలగూడెం వరకు రైల్వే లైన్ వేయాలని రఘురామిరెడ్డి గారు గట్టిగా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకి గౌరవ వరంగల్ మరియు మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు కూడా మద్దతు తెలిపారు. రఘురాం రెడ్డి గారు తమ ఈ ప్రతిపాదానను సంబంధిత అధికారులతో పాటు గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కూడా తెలియజేసి ఖమ్మం జిల్లా ప్రత్యేకంగా పాలేరు రైతులని కాపాడాల్సిందిగా కోరారు. ఈ ప్రతిపాదిత రైల్వే లైను అవసరమైన డోర్నకల్, మరిపెడ,మోతే నుండి విష్ణుపురం వరకు నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ కొత్త ప్రతిపాదిత రైల్వే లైన్ వరంగల్ మరియు సూర్యాపేట నల్గొండ జిల్లా వాసులకి ఎంతో ఉపయోగపడుతూ ప్రభుత్వానికి అనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ల్యాండ్ ఎక్విజేషన్ ఖర్చు కూడా తగ్గుతుంది అని తెలియజేశారు