అంతర్జాతీయం

ఇండోనేషియాలో ఐఫోన్16పై నిషేధం…!

  • యాపిల్ సంస్థకు షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ఇండోనేషియా సర్కార్
  • పెట్టుబడులపై ఇచ్చిన హామీని విస్మరించడం వల్లే ఆ నిర్ణయం అంటూ మీడియాలో కథనాలు
  • 40 శాతం స్థానికంగా తయారు చేయాలన్న నిబంధనను ఉల్లంఘించడం వల్లే ఈ పరిస్థితి అంటున్న పరిశ్రమల శాఖ

ప్రముఖ సెల్ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌కు షాక్ ఇస్తూ ఇండోనేషియా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండోనేషియా సర్కార్ తీసుకున్న నిర్ణయంతో సదరు సంస్థతో పాటు ఆ సంస్థ ఫోన్‌లు వాడే వినియోగదారులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంతకూ ఇండోనేషియా సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయం ఏమిటంటే.. యాపిల్ విడుదల చేసిన లేటెస్ట్ మోడల్ ఐఫోన్ 16పై నిషేదం విధించింది. తమ దేశంలో ఈ ఫోన్ విక్రయాలు, వినియోగంపై ఆంక్షలు పెట్టింది. 

ఇతర దేశాల్లో కొనుగోలు చేసినా తమ దేశంలో వాడడంపైనా నిషేధం విధించింది. ఈ విషయాన్ని ఆ దేశ పరిశ్రమల శాఖ మంత్రి గమివాంగ్ కర్తసస్మిత వెల్లడించారు. ఇండోనేషియాలో యాపిల్ ఐఫోన్ 16 వాడటానికి ఐఎంఈఐ సర్టిఫికేషన్ లేదని తెలిపారు. ఒకవేళ ఎవరైనా వాడితే అది అక్రమమే అవుతుందని చెప్పారు. ఇంతకూ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటే.. పెట్టుబడికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల ప్రభుత్వం యాపిల్‌పై ఈ నిర్ణయం తీసుకుందని వార్తలు వినబడుతున్నాయి. 

యాపిల్ సంస్థ 1.71 మిలియన్ రూపాయలు (ఇండోనేషియా కరెన్సీ) పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చింది. అయితే 1.48 మిలియన్ రూపాయలు మాత్రమే పెట్టుబడిగా పెట్టిందని, అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. యాపిల్ సంస్థ తమ హామీని అమలు చేయకపోవడం వల్లనే ఐఫోన్ 16పై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమ శాఖ మంత్రి వెల్లడించారు. ఇండోనేషియాలో విక్రయించాలంటే 40 శాతం స్థానికంగా తయారు చేయాలన్న నిబంధన ఉందని, దాన్ని అందుకోవడంలో యాపిల్ విఫలం చెందడంతో ఈ పరిస్థితి నెలకొందని చెప్పారు.     

Related posts

మోదీ, బైడెన్ ద్వైపాక్షిక సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలివే..

Ram Narayana

 ఫేస్‌బుక్ ప్రేమలో అనూహ్య పరిణామం.. ఇస్లాం స్వీకరించి పాక్ ప్రియుడ్ని పెళ్లాడిన భారత మహిళ అంజు

Ram Narayana

157 బిలియన్ డాలర్లకు యూఎస్ పెట్ ఇండస్ట్రీ.. అయినా చిక్కుల్లో చిన్న వ్యాపారులు..

Ram Narayana