యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న బంగారుబాబు
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం హైదరాబాద్కు చెందిన బంగారు బాబుగా పేరున్న కొండ విజయకుమార్ ఇవాళ యాదాద్రి వచ్చారు.
తెలంగాణ హాకీ సమాఖ్యకు అధ్యక్షుడుగా ఉన్న విజయ్ కుమార్ సుమారు 8 కిలోల విలువైన నగలతో నరసింహ స్వామి దర్శనం కోసం వచ్చి భక్తులను ఆకట్టుకున్నారు. ఇంకేముంది ఈ బంగారు బాబుతో సెల్ఫీలు కావాలని చాలామంది పోటీపడ్డారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవటం చాలా అదృష్టం అని కొండ విజయ్ కుమార్ తెలిపారు. 2016 నుంచి తమ హోప్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నామని తెలిపారు. స్వామి దయతో ఆ సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు కొండ విజయ్ కుమార్ చెప్పారు.