కేరళ సీఎం సీఎం పినరయి విజయన్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది…
ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు
త్రివేండ్రం సమీపంలో వామనాపురం వద్ద ఘటన
కాన్వాయ్ లో ఢీకొన్న ఐదు వాహనాలు
కేరళ ముఖ్యమంత్రి పినారయి విజయన్ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది …అయితే సీఎం కు గని కాన్వాయ్ లో ఉన్న సిబ్బందికి గాని ఎలాంటి గాయాలు కాలేదు …వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో నుజ్జు ,నుజ్జు అయ్యాయి…ఎవరి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు …వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సీఎం పినారవి విజయన్ కు అక్కడ నుంచి వేరే వాహనంలో పంపించారు …జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు …
తిరువనంతపురం జిల్లా వామనపురం వద్ద సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాన్వాయ్‌లోని ఐదు వాహనాలు వెనుక నుంచి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇందులో పోలీసు ఎస్కార్ట్, ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు, అంబులెన్స్ కూడా ఉండడం గమనార్హం. అదృష్టవశాత్తూ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో భద్రతా సిబ్బంది ముఖ్యమంత్రిని అక్కడ నుంచి పంపించారు .