Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

అణు క్షిపణులను పరీక్షించిన రష్యా…

  • సైనికాధికారులకు పుతిన్ కీలక ఆదేశాలు 
  • అణు క్షిపణుల పరీక్ష నిర్వహణ
  • యార్స్ ఖండాతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ని పరీక్షించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడి

ఉక్రెయిన్ విషయంలో పశ్చిమ దేశాలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షిపణి ప్రయోగాలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. సైనిక అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో అణ్వాయుధ సామర్థ్యం కల్గిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. 

పుతిన్ ఆదేశాలతో రష్యా సైనిక అధికారులు అణు క్షిపణులను పరీక్షించడం ప్రారంభించారు. కమ్‌చట్కా ద్వీపకల్పంలోని కురా టెస్టింగ్ రేంజ్‌లోని ప్లెసెట్స్క్ లాంచ్ ప్యాడ్ నుంచి యార్స్ ఖండాతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ని సైన్యం పరీక్షించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. అన్ని క్షిపణులు తమ లక్ష్యాలను ధ్వంసం చేశాయని తెలిపింది. 

గత నెలలో అమెరికా సహా నాటో మిత్ర దేశాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. రష్యాపై దాడులు చేసేందుకు పాశ్చాత్య దేశాలు ఇచ్చిన లాంగ్ రేంజ్ ఆయుధాలను ఉక్రెయిన్ ఉపయోగిస్తే, రష్యాపై నాటో యుద్దం ప్రారంభించినట్లుగా భావించాల్సి వస్తుందని పుతిన్ పేర్కొన్నారు. మరోపక్క, రష్యా అణ్వస్త్ర ప్రయోగాలతో నాటో అప్రమత్తమైంది.

Related posts

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

Ram Narayana

పారిస్ ఒలింపిక్స్‌ ఆరంభానికి ముందు ఫ్రాన్స్‌లో దుశ్చర్య..

Ram Narayana

షేక్ హసీనాను నవంబరు 18 లోగా అరెస్ట్ చేయండి… క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆదేశాలు

Ram Narayana

Leave a Comment