Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

చివర గింజ వరకు కొంటాం…మంత్రి పొంగులేటి

  • మద్దతు ధర ఇస్తాం… రైతులు అధైర్య పడొద్దు
  • డిసెంబర్ పూర్తి లోగా పెండింగ్ 13 వేల కోట్ల రుణమాఫీ
  • కూసుమంచి తహసిల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి/షాదీముబారక్ చెక్కులను పంపిణీ
  • రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. కూసుమంచి మండల తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్ చెక్కులను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ…. వరి పంట సాగు చేసిన రైతులు నిర్భయంగా ఉండాలని, చివరి గింజ వరకు మద్దతు ధరపై ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అదే విధంగా సన్న వడ్లకు క్వింటాల్ కు అదనంగా రూ. 500 రూపాయలు చెల్లిస్తామని అన్నారు. గత ప్రభుత్వాలు రైతుల పట్ల ఎలా వ్యవహరించాయో అందరికీ తెలుసన్నారు. ప్రజా ప్రభుత్వం రైతులు, మహిళలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఉన్న అప్పులు తీరుస్తూ, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల వరకు రుణాలు ఉన్న రైతులకు 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, మరో 13 వేల కోట్లు మాఫి చేయాల్సి ఉందని, డిసెంబర్ నెలాఖరు నాటికి పెండింగ్ రుణమాఫీ చేస్తుందని అన్నారు. నిరుద్యోగ యువతకు ప్రజా ప్రభుత్వం వచ్చిన పది నెలల వ్యవధిలో 57 వేల పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి పరీక్షలను నిర్వహించామని, డిసెంబర్ నెలలో వారికి ఉద్యోగాల అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని  మంత్రి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను తప్పనిసరిగా అమలు చేస్తామని అన్నారు.

ఈ సందర్భంగా 61 మంది కళ్యాణలక్ష్మి/షాదీముబారక్ లబ్దిదారులకు రూ. 61,07,076 ల చెక్కులను పంపిణీ చేశారు. కూసుమంచి మండలం నాయకన్ గూడెం లో ఇటీవలి వరదల్లో మృతి చెందిన షేక్ యాకుబ్, సైదాబీ దంపతుల కుమారులు షేక్ యూసుఫ్, షేక్ షరీఫ్ లకు కూసుమంచి మండల కేంద్రంలో ఇండ్ల స్థల పట్టాలను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

డీఏ పెండింగ్ పై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి …

Ram Narayana

డిప్యూటీ సీఎం భట్టి కృషితో సోలార్ విద్యుత్తు గ్రామంగా మారనున్న సిరిపురం!

Ram Narayana

సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజ్!

Ram Narayana

Leave a Comment