Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

భక్తి టీవీ కోటి దీపోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!

భక్తి టీవీ వారు నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు …భక్త కోటిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు …ఈసందర్భంగా నిర్వాకులను అభినందించారు …కార్యక్రంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ,కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్రమంత్రి సీతక్క , నరేంద్ర చౌదరి దంపతులు , రచనా చౌదరి తదితరులు పాల్గొన్నారు ..
వివిధ అధికారిక కార్యక్రమాలలో హాజరయ్యేందుకు ఆమె నగరానికి వచ్చారు. గురువారం హైదరాబాద్‌లో జరుగుతున్న కోటి దీపోత్సవానికి కూడా ఆమె హాజరుకానున్నారు. ఈ రోజు సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క తదితరులు ఘనస్వాగతం పలికారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.

బేగంపేట విమానాశ్రయం నుంచి ఆమె నేరుగా రాజ్ భవన్ చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి వెళ్లారు . రేపు శిల్పకళా వేదికలో జరుగుతోన్న లోక్ మంథన్-2024 కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆమె ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి రాక సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ..

Related posts

ప్రేమతోనే అలా చేశా, మరో ఉద్దేశం లేదు: హోం మంత్రి మహమూద్ అలీ

Ram Narayana

మహిళా జర్నలిస్టుల సమస్యల పై కమిషనర్ కు వినతిపత్రం…

Ram Narayana

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు.. నగదు తరలింపు వెనక ఐపీఎస్ అధికారి!

Ram Narayana

Leave a Comment