Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలుప్రమాదాలు ...

భారత జలాంతర్గామిని ఢీకొట్టిన చేపల వేట నౌక!

  • గోవా తీరానికి 70 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదం
  • చేపల వేట నౌకలో ఉన్న 13 మందిలో 11 మందిని రక్షించిన సిబ్బంది
  • ఇద్దరి కోసం భారీ రెస్క్యూ ఆపరేషన్

13 మందితో వెళుతున్న ఓ చేపల నౌక గోవా తీరానికి సమీపంలో భారత నౌకాదళ జలాంతర్గామిని ఢీకొట్టింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు గోవా తీరానికి 70 నాటికల్ మైళ్ల దూరంలో మారథోమా అనే చేపల వేట నౌక జలాంతర్గామిని ఢీకొట్టింది. పడవలోని 13 మందిలో 11 మందిని రక్షించినట్లు భారత నౌకాదళం వెల్లడించింది. మరో ఇద్దరి ఆచూకీ గల్లంతైందని తెలిపారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

ఇండియన్ నేవీ ఆరు నౌకలు, రెండు ఎయిర్ క్రాఫ్ట్స్‌తో భారీ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఈ ప్రాంతం మొత్తాన్ని కోస్ట్ గార్డ్ తమ ఆధీనంలోకి తీసుకొని… నౌకల మార్గాలను మళ్లించింది. జలాంతర్గామికి ఏ మేరకు నష్టం జరిగిందో తెలియాల్సి ఉంది.

Related posts

రోడ్డు మార్గంలో పోలీసులు అడ్డుకోవడంతో హెలికాప్టర్ లో వెళ్లిన రాహుల్ గాంధీ…

Drukpadam

అయోధ్యను నా గుండెల్లో పెట్టుకొని ఢిల్లీకి తిరిగి వచ్చాను: రాష్ట్రపతికి ప్రధాని మోదీ లేఖ

Ram Narayana

పొల్యూషన్ ఎఫెక్ట్.. ఢిల్లీలో స్కూళ్లకు సెలవు

Ram Narayana

Leave a Comment