Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ప్రజలు కేసీఆర్ పాలనే బాగుందని అంటున్నారు …మాజీమంత్రి హరీష్ రావు

అయితే తిట్లు లేదంటే దేవుని మీద ఓట్లు అన్నట్లుగా రేవంత్ పద్దతి ఉందని మాజీమంత్రి బీఆర్ యస్ నేత హరీష్ రావు సీఎం పై విమర్శలు గుప్పించారు …రెండు రోజుల ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన ముందుగా గ్రైన్ మార్కెట్ లో పర్యటించి రైతుల పరిస్థితి తెలుసుకున్నారు …అనంతరం ఆయన బీఆర్ యస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని చింతకాని మండలం లచ్చగూడెం , ప్రొద్దుటూరు గ్రామాల్లో పర్యటించారు …ఈసందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు …సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పని అయిపోయిందని ,చెప్పిన వాగ్దానాలు నెరవేర్చలేదని ప్రజలు అనుకుంటున్నారని , కేసీఆర్ పాలనే బాగుందని అంటున్నారని అన్నారు …నాటి పథకాలు ఏమి లేవని ప్రజలు వాపోతున్నారని మండిపడ్డారు …అమలు కానీ వాగ్దానాలు చేసి కాంగ్రెస్ ప్రజలకు మొఖం చాటేస్తుందని దుయ్యబట్టారు …

చింతకాని మండలం లచ్చగూడెంలో ఇటీవల కరెంట్ షాక్ తో మృతి చెందిన రైతు గూని ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు ప్రసాద్ చిత్రపటానికి పార్టీ నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు .అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పి , బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ..

అదే మండలంలోని ప్రొద్దుటూరు గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు …ప్రొద్దుటూరు గ్రామంలో కాంగ్రెస్ నాయకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న రైతు బోజెడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించారు.కుటుంబానికి అండగా ఉంటామని ప్రభాకర్ తండ్రికి భరోసా ఇచ్చారు … ప్రొద్దుటూరు గ్రామంలో హరీష్ రావుకి బీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు … మహిళలు మంగళహారతులు పట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు ..

ఆయన వెంట మాజీ మంత్రులు గుంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, MLC తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఉన్నారు ..

అక్రమ కేసులు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య కుటుంబానికి హరీష్ రావు పరామర్శించారు .. పెంట్యాల పుల్లయ్య పై పలు కేసులు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడంపై మండిపడ్డారు …ప్రొద్దుటూరులో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్ని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ఖండించారు.

కాంగ్రెస్ పార్టీ రాకతో సంక్షేమ పథకాల్లో మార్పు..

ఖమ్మం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ: మార్పు తెస్తామని ప్రజలను నమ్మించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలను మాయం చేసిన మార్పు తెచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.

ఖమ్మం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు కాంగ్రెస్ వారి పాలనలో ఏం కోల్పోయారని అడుగుతున్నాడని, కాంగ్రెస్ వచ్చాక రైతుబంధు పోయిందని, బతుకమ్మ చీరలు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రిషియన్ కిట్, బీసీ, దళిత, మైనార్టీ బంధు ఆగిపోయాయన్నారు. ఇదే కాంగ్రెస్ వచ్చాక వచ్చిన మార్పు అని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికల హమీలు మహాలక్ష్మి రూ.2,500, తులం బంగారం, ఆరుగ్యారెంటీ పథకాల హామీలు అమలు కాలేదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి బాండు పేపర్ రాసిచ్చి ఖమ్మం వాసులను మోసం చేశాడన్నారు. మహాలక్ష్మి పథకం రూ.2500పథకం కింద 11నెలలుగా 27,500 రూపాయలను కాంగ్రెస ప్రభుత్వం ఒక్కో మహిళకు బకాయి పడిందన్నారు. కాంగ్రెస్ వచ్చాక ఈ 11 నెలల్లో 6 లక్షల పెళ్లిళ్లు జరిగాయని, అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 6 లక్షల తులాల బంగారం తెలంగాణ ఆడబిడ్డలకు బాకీ పడిందని చెప్పుకొచ్చారు.

కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు ఏడాదిలోపునే అనుకుంటున్నారని, మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ ఉచిత బస్సు తప్ప అంతా తుస్సు అన్నారు. ఉచిత బస్సు పెట్టి బస్సుల ట్రిప్పులను తగ్గించి మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని అందరి దేవుళ్లపై ఒట్టు పెట్టి పంద్రాగస్టు కల్లా 2లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి దేవుళ్లను, రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశాడని విమర్శించారు. సీఎం రేవంత్ తీరు అయితే ఒట్లు, లేకపోతే తిట్లు పనిచేసేది తక్కువ, మాటలెక్కువని ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏమో అదానీని అరెస్టు చేయలంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అదానీ వద్ద 100 కోట్లు తెచ్చుకున్నాడని, లోపలికెళ్ళి వేరే.. బయటకెళ్లి వేరే విరాళాలు ఇచ్చాడని దీనిపై విచారణ చేసి సీఎంను అరెస్టు చేయాలన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేదించి అక్రమ కేసులు పెడితే మేం అధికారంలోకి వచ్చాక మూల్యం చెల్లించక తప్పదన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలు అమలు చేసేదాక బీఆర్ఎస్ వదిలిపెట్టబోదన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో మార్పులు చోటు చేసుకున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇవ్వకుండా మార్పు తీసుకువచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉత్సవాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి నెలా అక్కాచెల్లెళ్లకు రూ. 2500 ఇస్తామని చెప్పి 11 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వలేదని, దాంతో వారికి ప్రభుత్వం రూ. 27,500 బాకీ పడ్డారని ధ్వజమెత్తారు.

అంతకు ముందు ఖమ్మం మార్కెట్ లో పత్తి మిర్చి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ ,వద్దిరాజు రవిచంద్ర , ఎమ్మెల్యేకి ,జిల్లా బీఆర్ యస్ అధ్యక్షులు తాతా మధు , మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఉన్నారు ..

బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలోనే మా రైతులకు మేలు జరిగిందంటూ మంత్రి హరీష్ రావు రైతులు తమ గోడును చెప్పుకున్నారు …ఖమ్మం మార్కెట్లో పత్తి కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని రైతులు వివరించారు …

వారి వెంట మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు MLC తాతా మధుసూదన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వెంకటవీరయ్య ,‌ కొండబాల కోటేశ్వరరావు, బానోతు చంద్రావతి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ వై శ్రీనివాస్, ఆర్జేసీ కృష్ణ తదితరులు ఉన్నారు ..

Related posts

కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నావ్? అని అడుగుతున్నారు: రేవంత్ రెడ్డి

Ram Narayana

బర్రెలక్క శిరీష ధైర్యంగా ముందుకు సాగుతోంది… మనందరికీ ఆదర్శం: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Ram Narayana

వర్గీకరణను వ్యతిరేకించే పార్టీలకు గుణపాఠం తప్పదు … మందకృష్ణ మాదిగ…

Ram Narayana

Leave a Comment