Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

కమ్యూనిస్ట్ నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం పోటు ప్రసాద్…పలువురు ప్రముఖుల నివాళు!

గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందిన సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ కమ్యూనిస్ట్ నిర్వచనానికి నిలువెత్తు నిరదర్శనమని పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు …బుధవారం ఉదయం లకారం పార్క్ లో వాకింగ్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన పోటు ప్రసాద్ ను సహచర వాకర్స్ దగ్గరలోనే ఉన్న మమతా సూపర్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ కు హుటాహుటిన తరలించారు …ఆయన పరీక్షించిన డాక్టర్లు మరణించినట్లు ధ్రువీకరించారు …సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావు కూడా అక్కడే ఉన్నారు …ఆయన చూస్తుండగానే ఆయన బల్లమీద కూర్చొని కూలిపోవడం చూశానని అన్నారు …వెంటనే ఆసుపత్రికి తరలించామని తెలిపారు …అక్కడ నుంచి ప్రజల సందర్శనార్థం సిపిఐ జిల్లా కార్యాలయం గిరి ప్రసాద్ భవనం కు తరలించారు …ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉంచి తిరిగి మమతా హాస్పటల్ కు తరలించారు …సిపిఐ జిల్లా కార్యాలయంలో పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు …సిపిఐ సీనియర్ నేత పువ్వాడ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావులు కామ్రేడ్ ప్రసాద్ భౌతిక కాయాన్ని చూసి కంట తడి పెట్టుకున్నారు … తర్వాత వారి కుటుంబసభ్యులను బరువెక్కిన హృదయంతో ఓదార్చారు …రాష్ట్ర రెవెన్యూ , గృహనిర్మాణం , సమాచార ప్రసారాల శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు …కుటుంబసభ్యులను ఓదార్చారు…నిబద్దగల నేతను కోల్పోయామని అన్నారు …సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటు ప్రసాద్ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని నివాళులు అర్పించారు,సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు ఎస్ .వీరయ్య, పోతినేని సుదర్శన్ …సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి , భాగం హేమంతరావు , సిపిఐ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా , ఖమ్మం జిల్లా సహాయ సిపిఐ కార్యదర్శి దండి సురేష్ , సిపిఐ జిల్లా నాయకులూ మహమ్మద్ మౌలానా , పోటు ప్రసాద్ సోదరి రాష్ట్ర మహిళాసంఘం నాయకురాలు పోటు కళావతి , జితేందర్ రెడ్డి , సింగ్ నరసింహారావు , జానీ ,బిజీ క్లెమెంట్ , తాటి వెంకటేశ్వర్లు , పెద్దబ్బాయి , తాటి నిర్మల , సీతామహాలక్ష్మీ , రామాంజనేయులు ,పుచ్చకాయలు కమలాకర్ , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్,తెలుగుదేశం పార్టీ ఖమ్మం లోకసభ ఇంచార్జి వాసిరెడ్డి రామనాథంలు భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు …

ఖమ్మం జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్న రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ఏఐటీసీ నాయకులు కామ్రేడ్ పోటు ప్రసాద్ అకస్మాత్తుగా వాకింగ్ లోనే 60 సంవత్సరాలు నిండకుండానే మరణించడం చాలా దురదృష్టకరం.
రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ లో పనిచేసి విద్యార్థి ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా పోటు ప్రసాదు కీలకంగా పనిచేశారు. హైదరాబాదులో జరిగిన విద్యుత్ ఉద్యమం పోరాటంలో పోలీసుల దెబ్బలు, గుర్రాలతో తొక్కించి గాయపరిచినా ఆ రోజుల్లో ధైర్యంగా పోలీసులని ఎదుర్కొని అరెస్టయ్యారు. అలాగే భూ సమస్య పైన కామ్రేడ్ నారాయణ, కామ్రేడ్ రాఘవులు నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఖమ్మంలో భూ పోరాటంలో పాల్గొని పోలీసులతో దెబ్బలు తిని రక్తం కారుతున్నా వెనుతిరగకుండా నిలబడ్డాడు. కామ్రేడ్ పువ్వాడ నాగేశ్వరరావు, కామ్రేడ్ సిద్ది వెంకటేశ్వర్లు, కామ్రేడ్ చౌదరికి, నాకు అత్యంత సన్నిహితుడు. రాష్ట్ర పార్టీ సమావేశాలలో కీలకమైన అంశాల పైన చక్కగా విశ్లేషణ చేసి మాట్లాడే మేధావి కామ్రేడ్ పోటు ప్రసాద్. ఖమ్మంలో పార్టీ స్టడీ సర్కిల్ పెట్టి అనేకమందికి పార్టీ పట్ల, ఇతర విద్య అంశాల పట్ల అవగాహన కల్పించడంలో, ఇప్పటికీ విద్యార్థి యువజన సంఘాలకు దిశా దశ నిర్దేశించడంలో చురుకుగా పాల్గొంటున్నాడు. నల్గొండ జిల్లా రంగాపురం లో పోటు ప్రసాద్ గారు పుట్టారు.ఆయన తండ్రి రాఘవయ్య గారు అనేక సంవత్సరాలు జైలు జీవితం అనుభవించారు. అనేక కేసుల్లో ఇరికించబడ్డారు. పోటు ప్రసాద్ నాయనమ్మ ఎర్రమ్మ తెలంగాణ రజాకార్లు, పోలీసులు పెట్టిన బాధలకు ఊరు విడిచి ఆంధ్రాలో తల దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె చాకలి ఐలమ్మ లాగా వీర వనిత. వారి కుటుంబం మొత్తం కమ్యూనిస్టు పార్టీని వదలకుండా ఉన్నారు. ఆస్తులు అన్ని కరిగిపోయినా ఉత్తమ కమ్యూనిస్టు గానే ఉన్నాడు ప్రసాద్. ఆయన అక్క పోటు కళావతి పార్టీలో కీలకంగా పనిచేస్తూ రాష్ట్ర మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా పనిచేసింది. మహిళా సమైక్య ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషిస్తుంది. ప్రసాద్ అన్నా తమ్ముడు ఆయన మేనకోడలు అందరూ కూడా కమ్యూనిస్టు పార్టీలోనే ఉంటూ యాక్టివ్ గా పాల్గొంటున్నారు. పార్టీ ఎలాంటి కార్యక్రమం చేసిన వారి కుటుంబం మొత్తం ముందుంటుంది. అటువంటి ప్రసాదు రెండుసార్లు గుండె ఆపరేషన్ చేయించుకుని ఉదయం నుండి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మునిగిపోయి చనిపోవడం బాధాకరం. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా పట్టుదలతో కర్తవ్య దీక్షతో నిర్వహించే ఉత్తమ కమ్యూనిస్టు పోటు ప్రసాద్. పుస్తకాలు చదవడం, విషయాలపై అవగాహన పెంచుకోవడంలో మంచి అధ్యయనశాలి. సైదాంతిక సమస్య వచ్చినప్పుడు చాలా గొప్పగా కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాన్ని, మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఇతరులకు చెప్పి ఒప్పించడంలో ఎంతో నేర్పరి. పోటు ప్రసాద్ మరణం నాకు తీరని లోటు. ఆయనకు నా విప్లవ జోహార్లు.

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఖమ్మం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పోటు ప్రసాద్ అకాల మరణం పట్ల బీఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వర రావు విచారం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన లో సంతాపం తెలిపారు.

  • ప్రజల సమస్యలపై అహర్నిశలు పోరాడుతూ, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రాణంపెట్టిన పోటు ప్రసాద్ ఒక ఆదర్శ నాయకుడిగా గుర్తుండిపోతారని అన్నారు.
  • కమ్యూనిస్టు ఉద్యమాలకు జీవితాన్ని అంకితం చేసిన ఆయన ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించారని, ఖమ్మం జిల్లాను చైతన్యవంతంగా తీర్చిదిద్దడంలో పోటు ప్రసాద్ కృషి చిరస్మరణీయమని నామ కొనియాడారు.
  • పోటు ప్రసాద్ లాంటి నాయకుడిని కోల్పోవడం కమ్యూనిస్టు ఉద్యమానికి, ప్రజా సంఘాలకు తీరని లోటు అని నామ అభివర్ణించారు.
  • వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నామ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పోటు ప్రసాద్ గారి హఠాన్మరణం అత్యంత బాధాకరమైన విషయం. ఆయన అకాల మరణం పట్ల భారత రాష్ట్ర సమితి (BRS) జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. కామ్రేడ్ పోటు ప్రసాద్ విద్యార్థి దశ నుంచే వామపక్ష రాజకీయాలలో చురుకుగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడినారు. తన కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) లో సుదీర్ఘ కాలం పాటు పనిచేస్తూ జిల్లా కార్యదర్శి స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ పోటు ప్రసాద్. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఎర్రజెండా నీడలో నిబద్ధతగా పనిచేసిన నాయకుడు కామ్రేడ్ పోటు ప్రసాద్. కామ్రేడ్ పోటు ప్రసాద్ కుటుంబ సభ్యులకు, సీపీఐ శ్రేణులకు BRS పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తుంది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ…..

సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ హఠన్మరణం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టియడబ్ల్యుజె -ఐజెయు) జిల్లా కమిటి తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేసింది.ఈమేరకు యూనియన్ ముఖ్య నాయకులు సిపిఐ జిల్లా కార్యాలయంలోని పోటు ప్రసాద్ భౌతకకాయాన్ని సందర్శించి నివాళ్ళులు అర్పించారు.నిజమైన కమ్యూనిస్టు వాది ,నిష్కలంక పోరాట యోధుడు ,ఉద్యమాలకు మార్గదర్శకుడు పోటు ప్రసాద్ అకాల మరణం కలచివేసిందన్నారు.అందరిలో తలలోనాలుకలా వ్యవహరించే పోటు ప్రసాద్ అకాల మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని టియుడబ్ల్యుజె (ఐజెయు)రాష్ట్ర కార్యదర్శి కె రాంనారాయణ పేర్కోన్నారు. కమ్యూనిస్టు కుటుంబానికి చెందిన పోటు ప్రసాద్ విద్యార్ది దశ నుంచే ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్ని అంచలంచెలుగా సిపిఐ జిల్లా కార్యదర్శి స్దాయికి ఎదిగారని అన్నారు.జర్నలిస్టు సమస్యలపై ఎప్పుడు కూడా సానుకూలంగా స్పందిస్తూ అండగా ఉండేవారని పేర్కోన్నారు.నిడారంబరుడు, వివాదరహితుడుగా పేరు సంపాదించుకోని రాజకీయాలకు అతీతంగా ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్నారని అన్నారు. కమ్యూనిస్టు సిద్దాంతాలను తు. చ తప్పకుండా పాటిస్తూ కార్మిక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఆయన చెప్పారు. నివాళ్ళులు అర్పించిన వారిలో రాంనారాయణతోపాటు టియుడబ్ల్యుజె (ఐజెయు) జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర్ రావు,జిల్లానాయకులు నల్లజాల వెంకట్రావ్,మైనోద్దిన్,తాళ్ళూరి మురళీ, జనార్దనాచారి,కళ్యాణ్, చెరుకుపల్లి శ్రీనివాస్,గోసుల నాగేశ్వర్ రావు,బుర్రి శ్రీనివాస్,సీనియర్ పాత్రికేయులు శంకేసి శంకర్ రావు,ఎన్ ఎస్ రావు,తుమ్మలపల్లి ప్రసాద్, తదితరులు ఉన్నారు. ఈ సందర్బంగా పోటు ప్రసాద్ కుటుంబ సభ్యులకు టియుడబ్ల్యుజె జిల్లా కమిటి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేసింది.

Related posts

కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణం జరిగితే సిబ్బందిపై కఠిన చర్యలు ..జిల్లా కలెక్టర్ !

Ram Narayana

పది రోజుల్లో మళ్లీ వస్తా..పనుల్లో పురోభివృద్ధి లేకపోతే చర్యలు తప్పవు…మంత్రి పొంగులేటి!

Ram Narayana

రైతులే నేరుగా కూరగాయల వ్యాపారం చేసేలా చర్యలు …మంత్రి తుమ్మల

Ram Narayana

Leave a Comment