- 4 నుంచి ఒడిశాలోని పూరి తీరంలో నేవీ డే ఉత్సవాలు
- సన్నాహక విన్యాసాలు నిర్వహిస్తుండగా మధ్యలోకి పక్షి
- దాని గమనాన్ని జాగ్రత్తగా గమనిస్తూ తప్పించిన పైలెట్లు
ఒడిశాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పూరి సముద్ర తీరంలో నిన్న నిర్వహించిన నౌకదళ సన్నాహక విన్యాసాల్లో పెను ప్రమాదం తప్పింది. విన్యాసాలు చేస్తున్న హెలికాప్టర్ల మధ్యలోకి అకస్మాత్తుగా ఓ పక్షి వచ్చేసింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు పక్షి గమనాన్ని జాగ్రత్తగా గమనిస్తూ దానిని తప్పించుకుని వెళ్లడంతో ప్రమాదం తప్పింది. హెలికాప్టర్లు ఒకవేళ దానిని ఢీకొని ఉంటే పెను ప్రమాదమే జరిగేదని చెబుతున్నారు.
ఈ ఏడాది భారత నేవీ డే వేడుకలను తొలిసారి పూరిలో నిర్వహిస్తున్నారు. ఒడిశా రాష్ట్రం కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకుంటోంది. ఈ నెల 4న నేవీ డే ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దీనికి ముందు దాదాపు 15 రోజుల నుంచి తీరంలో తినుబండారాలు, వాటి వ్యర్థాలు లేకుండా పర్యవేక్షిస్తారు. లేదంటే వాటి కోసం వచ్చే పక్షుల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాగా, 24 యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు సహా 40 యుద్ధ విమానాలు విన్యాసాల్లో పాల్గొంటాయి.