Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మంలో జన భోజనాలకు విశేష స్పందన …

కార్తీకమాసం వచ్చిందంటే కులాలవారీగా వన భోజనాలు …. ఎక్కడ తోటలు ఉన్న కులాల వారితో నిండిపోతున్నాయి… మిగతా జిల్లాల సంగతి ఎలా ఉన్న ఖమ్మంలో మాత్రం కులాలవారీగా విడిపోయి వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం వారి కులాల గురించి చెప్పుకోవడం ఆనవాయితీగా మారింది …ప్రత్యేకించి ఎన్నికలు వచ్చాయంటే దీని తీవ్రత మరి ఎక్కువగా ఉంటుంది …పోటీచేసే అభ్యర్థులు సైతం కులాల భోజనాలు ప్రోత్సహించి తమకు అనుకూలంగా మార్చుకొని ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు ..కొందరు ప్రజాప్రతినిదులు కుల వనభోజల దగ్గరకు వెళ్ళితే వారిది కూడా ఇదే కులమంటూ ఆయా కులాలవారిని ఆకర్షించే ప్రయత్నం చేయడం మామూలైపోయింది ..

అందుకు భిన్నంగా ప్రత్యామ్నాయ సంస్కృతి పెంపొందించేందుకు సిపిఐ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఖమ్మంలో మలీదు జగన్ మామిడి తోటలో జరిగిన కుల మతాతీత జన భోజనాలను విశేష స్పందన వచ్చింది …కులాలు మాటలకూ అతీతంగా జనబోనాల్లో పాల్గొని తాము కులబోనాలకు అనుకూలం కాదని చాటి చెప్పారు ..

కార్యక్రమంలో పాల్గొన్నా వక్తలు మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పి. రంగారావు, విద్యావంతుల వేదిక నాయకులు అంబటి నాగయ్య, మాజీ మావోయిస్టు జంపన్న, స్పర్శ అధ్యయన వేదిక బాధ్యులు స్పర్శ భాస్కర్ మాట్లాడుతూ ఐక్యంగా ఉన్న ప్రజల మధ్య కుల మతాల వైరుధ్యాలను పెంచి రాజకీయ పబ్బం పొందేందుకు కులమతాలను నిలబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని దీనికి వ్యతిరేకంగా అశేష ప్రజానీకం ఐక్యంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. ప్రజలు చైతన్యమైతే పాలకుల ఆటలు సాగవు కనుక ప్రజల మధ్య తప్పుడు చరిత్రను సాంస్కృతిని సమ సమాజం ఆమోదించని సనాతన ధర్మాలను పెంపొందిస్తున్నారని వారు అన్నారు. అన్నం మెతుకులపై కులాన్ని అంటించి రాజకీయ లబ్ధి పొందేందుకు కుల భోజనాలను పెంపొందిస్తున్నారని ధ్వజమెత్తారు … రాజ్యాంగం పై ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు కులమత కార్యక్రమాలలో ఎలా పాల్గొంటారు అని వారు ప్రశ్నించారు. కులభోజనాలకు పోవడం ఘనంగా చాలామంది భావిస్తున్నారని ఆభావజాలానికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్య పరచాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య వాదులపై ఉందని అన్నారు. మనువాదం పెచ్చు మీరుతున్న ఈ సమాజంలో ప్రజలు ఐక్యతను ప్రదర్శించాలని వక్తలు పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రోత్సహించేందుకు ఖమ్మం ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రత్యామ్నాయ సంస్కృతికి తెలంగాణ ప్రజలు ఖమ్మం గుమ్మం వైపు చూస్తున్నారని ఈ సాంస్కృతిని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రయత్నించాలని వారు అభిప్రాయపడ్డారు …

జన భోజనాల్లో క్రీడా పోటీలు నిర్వహించారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కళాకారులు ఆడి పాడి రంజంప చేశారు.వక్తలు జన భోజనాలను ఇంత ఘనంగా నిర్వహించిన మాస్ లైన్ నాయకులని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు ఆవుల వెంకటేశ్వర్లు సివై పుల్లయ్య అశోక్ సిహెచ్ శిరోమణి ఝాన్సీ కొల్లేటి నాగేశ్వరరావు శోభ కే శ్రీనివాస్ తేజ రాకేష్ మంగతాయ్ లక్ష్మణ్ హనుమంతరావు ఆజాద్ వెంకటేష్ లక్ష్మణ్ బల్లెపల్లి వెంకటేశ్వర్లు ధరణి కృష్ణ లెనిన్ కొమరయ్య తదితరులు పాల్గొన్నారు…

Related posts

యాతలకుంట వద్ద సీతారామ ప్రాజెక్ట్ టన్నెల్ పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి ….

Ram Narayana

తరుగు పేరుతో దోపిడి అరికట్టాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు…

Drukpadam

నామ గెలుపుకోసం ఎంపీ వద్దిరాజు బురహాన్ పురంలో విస్త్రత ప్రచారం…

Ram Narayana

Leave a Comment