సారధి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభించిన తుమ్మల
నెరవేరిన ఈ ప్రాంత ప్రజల కల
సుదీర్ఘకాలంగా ఖమ్మం నగరవాసులు ఎదురుచూస్తున్న సారధి నగర్ మామిళ్లగూడెం రైల్వే అండర్ బ్రిడ్జి మంత్రి తుమ్మల కృషితో ప్రజలకు అందుబాటులోకి వచ్చి వారి చేతుల మీదగా ప్రారంభోత్సవం జరుపుకోవడం శుభ పరిణామం, అనంతరం ఖమ్మం నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షులు ఎర్రం బాలగంగాధర్ తిలక్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు ప్రసంగిస్తూ దాదాపు నాలుగు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్య పరిష్కారమై ఈరోజు ఈ ప్రాంత ప్రజలు సమక్షంలో ప్రారంభించుకోవడం శుభపరిణామం అన్నారు అదేవిధంగా మీ అందరి సహకారంతో జిల్లా అధికార యంత్రాంగంతో ఖమ్మం జిల్లా మరియు ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధికి మౌలిక వసతులు రూపకల్పనకు ప్రజల కోసం సంక్షేమ పథకాల అమలుకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజుముల్ ఖాన్ ,నగర పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు , నగర మేయర్ పూనకొల్లు నీరజ ,మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , మున్సిపల్ కమిషనర్ అగస్త్య , నగర పాలక సంస్థ ఉప మేయర్ ఫాతిమా జోహార్ ,స్థానిక కార్పొరేటర్ కన్నం వైష్ణవి, దుదుకూరి వెంకటేశ్వర్లు , మాజీ కార్పొరేటర్లు నాగండ్ల దీపక్ చౌదరి , వడ్డే బోయిన నరసింహారావు , మాజీ కౌన్సిలర్ సింగం అంజయ్య, నగర బీసీ సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్ , స్థానిక నాయకులు ఎస్కే రజ్జి, బోజడ్ల సత్యనారాయణ , నరసింహారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, నగర ప్రముఖులు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.