Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్…

  • పవన్ కార్యాలయానికి బెదిరింపు కాల్స్
  • పవన్ కు, పోలీసులకు తెలియజేసిన కార్యాలయ సిబ్బంది
  • పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చిన హోంమంత్రి అనిత

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ ఇవాళ ఆయన కార్యాలయానికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. అంతేకాదు, పవన్ ను ఉద్దేశించి అభ్యంతరకర రీతిలో ఆ వ్యక్తి సందేశం కూడా పంపినట్టు తెలిసింది. ఈ బెదిరింపు కాల్స్ వ్యవహారాన్ని డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది పవన్ కల్యాణ్, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. 

పవన్ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ రావడం పట్ల హోంమంత్రి అనిత స్పందించారు. ఈ వ్యవహారంపై ఆరా తీశారు. వెంటనే పోలీసు ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. వారితో మాట్లాడిన అనిత, వెంటనే నిందితులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. హోంమంత్రి ఆదేశాల నేపథ్యంలో, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. 

పవన్ కార్యాలయానికి బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని కృష్ణలంక పోలీసులు గుర్తించారు. విజయవాడ లబ్బీపేట వాటర్ ట్యాంక్ రోడ్ లో ఉంటున్న మల్లికార్జున్ ఈ కాల్ చేసినట్టు నిర్ధారించారు. దాంతో, మల్లికార్జున్ ఫోన్ ట్రాక్ చేసేందుకు ప్రయత్నించగా… మల్లికార్జున్ ఫోన్ స్విచాఫ్ చేశాడు.

Related posts

వైఎస్ మరణంలో చంద్రబాబు కుట్ర ఉందేమోనని డౌటు: ఎంపీ మోపిదేవి

Drukpadam

చంద్రబాబుకు భారీ ఊరట.. అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు

Ram Narayana

అయోధ్యలో 15 లక్షల ప్రమిదలను వెలిగించి గిన్నిస్ రికార్డు!

Drukpadam

Leave a Comment