Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

అవినీతి ఆరోపణలతో కోర్టుకు హాజరైన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు…

  • ఓవైపు యుద్ధ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్
  • మరోవైపు అవినీతి ఆరోపణలతో నెతన్యాహు సతమతం
  • నేడు బంకర్ లో విచారణ ఏర్పాటు చేసిన టెల్ అవీవ్ కర్టు

ఓవైపు మిలిటెంట్ సంస్థలు, వాటికి మద్దతిచ్చే దేశాలతో ఇజ్రాయెల్ పోరాటం సాగిస్తుండగా… మరోవైపు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్నారు. ఎంతో సీనియర్ రాజకీయవేత్త అయిన నెతన్యాహు ఇప్పుడు అవినీతి కేసులో టెల్ అవీవ్ కోర్టుకు హాజరయ్యారు. 

తనకు అనుకూలంగా వార్తలు ప్రసారం చేసేందుకు కొన్ని మీడియా సంస్థలకు సాయం చేయడం, ఓ హాలీవుడ్ నిర్మాత నుంచి ఖరీదైన బహుమతులు అందుకుని, అందుకు ప్రతిఫలంగా అతడికి లబ్ధి చేకూర్చారన్నది నెతన్యాహుపై ఉన్న ఆరోపణలు. నాలుగేళ్ల కిందట ఈ కేసు విచారణ ప్రారంభమైంది. 

ఈ నేపథ్యంలో… అవినీతి ఆరోపణలు, విశ్వాస ఘాతుకం, మోసం అభియోగాలపై కోర్టు నేడు విచారణ చేపట్టింది. అయితే ఈ విచారణ కోర్టు హాల్ లో కాకుండా… కోర్టు భూగర్భంలో ఉన్న బంకర్ లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ యుద్ధంలో పరిస్థితులు ఎదుర్కొంటుండడంతో, ఈ విచారణను బంకర్ లో చేపట్టారు.

Related posts

త్వరలోనే కొత్త ఫీచర్ తీసుకురానున్న వాట్సాప్.. ఇక ఈజీగా ఫైల్ షేరింగ్

Ram Narayana

వాహ్ అనిపించేలా దక్షణ కొరియా దిగ్గజ ఎల్జీ కంపెనీ వినూత్న టీవీ ఆవిష్కరణ

Ram Narayana

భారత మాజీ నేవి సిబ్బంది 8 మందికి ఖతార్ మరణశిక్ష విధించడంపై స్పందించిన భారత్

Ram Narayana

Leave a Comment