తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

లగచర్ల రైతులకు సంఘీభావంగా.. చేతుల‌కు బేడీల‌తో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!


లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. నల్ల రంగు అంగీలు, చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. “ఇదేమి రాజ్యం.. ఖాకీ రాజ్యం.. దోపిడి రాజ్యం, లాఠీ రాజ్యం.. లూటీ రాజ్యం, రైతులకు సంకెళ్లా సిగ్గు సిగ్గు” అంటూ అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు. లగచర్ల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంట‌నే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఈ వినూత్న నిర‌స‌న తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.  

Related posts

ఉపాధి హామీ పథకంలో మార్పులకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం..

Ram Narayana

తెలంగాణ అసెంబ్లీ వ‌ద్ద ఉద్రిక్త‌త‌.. పోలీసుల అదుపులో కేటీఆర్‌, హ‌రీశ్‌రావు

Ram Narayana

గత ప్రభుత్వాల పాపాలకు నేటి ప్రతిపక్ష నేతలదే బాధ్యత: రేవంత్ రెడ్డి

Ram Narayana