Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
పార్లమంట్ న్యూస్ ...

జమిలి బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేందుకు ఓటింగ్ …269 -198 ఓట్లతో అనుమతి…!

జమిలి ఎన్నికల బిల్లుపై దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి…ఒక పక్క అధికార పక్షం జమిలి ఎన్నికలు తీసుకొస్తామని ప్రకటించి ముందుకు పోతుండగా దాన్ని అడ్డుకునేందుకు విపక్ష ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తుంది …బిల్లు పెడతాము ఒకసారి లేదు వాయిదా వేస్తున్నామని మరోసారి కేంద్ర దోబూచులాడింది …చివరకు పార్లమెంట్ ముందుకు తీసుకోని వచ్చింది …అయితే బిల్లు పెట్టాలా లేదా అనేదానిపై పార్లమెంట్ లో వాడి వేడి చర్చ జరిగింది ..దీంతో పార్లమెంట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి మేఘవాలా ఓటింగ్ కు అంగీకరించారు ..దీంతో ఓటింగ్ జరిగింది ..ఓటింగ్ లో బిల్లు పెట్టేందుకు అనుకూలంగా 269 ఓట్లు రాగ , బిల్లు పెట్టద్దని వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి…మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు జమిలి బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడం ఖాయమైంది ..అయితే దీన్ని జేపీసీ కు పంపాలా వద్ద అనేదానిపై మరోసారి చర్చ జరిగే అవకాశం ఉంది …బిల్లు పై విస్తృత చర్చజరగాలని తాము కోరుకున్నామని కేంద్రం తెలిపింది ..బిల్లును పార్లమెంట్ ఆమోదించడం అంత తేలిక కాదు ..ఎందుకంటే రెండు సభల్లో బిల్లు అనుకూలంగా 2 /3 మంది సభ్యులు ఓటు చేయాల్సి ఉంటుంది …ఏదైనా మిరకిల్ జరిగితే తప్ప బిల్లు నెగ్గటం కష్టం …అయినప్పటికీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ముందుకు పోతుంది …దీంతో సర్కార్ వైఖరి విపక్షాలకు అంతుపట్టడంలేదు …

జమిలి ఎన్నికలు మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ,రాష్ట్ర హక్కులు హరించబడతాయని , నియంతృత్వం వైపు దేశం పోయే అవకాశం ఉందని విపక్షాలు ఆందోళ వ్యక్తం చేస్తున్నాయి…పాలక పక్ష మాత్రం చీటికి మాటికీ ఎన్నికలు అభివృద్ధికి ఆంటంకంగా మారాయని , ఖర్చుతో కుడు కున్నావని చెపుతుంది …దీనిపై మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ అందరి అభిప్రాయాలను తీసుకోని ఒక నివేదికను కేంద్రానికి అందజేసింది …చివరకి ఏమి జరుగుతుందనే ఆసక్తి దేశ వ్యాపితంగా నెలకొన్నది …

Related posts

రాజ్యసభలో నోట్లు కలకలం.. కాంగ్రెస్ ఎంపీ సీటు వద్ద లభ్యం!

Ram Narayana

రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేసిన రేణుకా చౌదరి

Ram Narayana

లోక్ సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై అభ్యంతరం తెలిపిన ప్రధాని మోదీ, అమిత్ షా!

Ram Narayana

Leave a Comment