విద్యార్థి పోరాటాల వేగు చుక్క ఎస్ ఎఫ్ ఐ… వై విక్రమ్
‘అధ్యయనం- పోరాటం’ తో దేశ విద్యార్ధి ఉద్యమంలో కీలకపాత్ర
స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలతో ముందుకు
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం 55 ఏళ్ల అలుపెరగని త్యాగాల బాటలో నడిచిన ఎస్ఎఫ్ఐ …జిల్లా కార్యదర్శి టి ప్రవీణ్
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ ఆర్ అండ్ బిజీ ఎన్ ఆర్ ప్రభుత్వడిగ్రీ కళాశాల ఉమెన్స్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలల వద్ద ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా నాయకులు రాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు వై విక్రమ్, జిల్లా కార్యదర్శి ప్రవీణ్ లు ముఖ్యఅతిధులు గా హాజరై మాట్లడుతూ విద్యార్థి ఉద్యమ పోరాటాల వేగుచుక్క ఎస్ఎఫ్ఐ అని వారు అన్నారు .స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం అనే నినాదంతో ఉన్న జెండాను ఆవిష్కరించారు అనంతరం స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ1970 డిసెంబర్ 30వ తేదీన కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం ప్రాంతంలో ‘అధ్యయనం- పోరాటం’ అను నినాదంతో స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం అనే లక్ష్యాలతో మొదటగా 11 మంది సభ్యులతో ఏర్పడి 55 సంవత్సరాలు గడుస్తుందనీ. అప్పటి నుండి విద్యార్థుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. ఈ పోరాటంలో చాలా మంది విద్యార్థి నాయకులని కోల్పోయినప్పటికీ, నిర్బంధాలు ఎదుర్కొంటూ, ప్రభుత్వాలు దాడులు చేస్తున్నప్పటికీ, నాయకుల మీద కేసులు పెడుతున్నప్పటికి , మతోన్మాద దాడులను తిప్పి కొడుతూ,శాస్ర్తియ విద్యావిధానం కోసం అనునిత్యం పోరాడుతూ ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా నిత్యం విద్యార్థుల పక్షాన ఉంటూ అనేక రూపాల్లో భవిష్యత్తులో విద్యారంగం కోసం పోరాటం చేస్తామని ఉద్ఘాటించారు. మా దేహాలు ముక్కలైన కానీ, ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం, అనే నినాదంతో , ముందుకు పోతుందని తెలిపారు.విద్యార్థుల సమస్యలే లక్ష్యంగా ఎన్నో విజయాలు సాధిస్తూ సమరశీల పోరాటాలను కొనసాగిస్తూ ఈ భారత దేశంలో అతిపెద్ద విద్యార్థి సంఘంగా అవతరించిందన్నారు.నాటి నుండి నేటివరకు విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ ఈ భారత దేశంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ముందుకు సాగుతున్న ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని దేశంలో ఉన్నటువంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయి అన్నారు. ప్రైవేట్ కార్పొరేటు విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ విద్యా రంగాన్ని దెబ్బతీసే కుట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయినప్పటికీ కూడా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి విద్యశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 15% నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడాలని విద్యారంగ సమస్యలను బాగుచేయలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు సదానందం జిల్లా జిల్లా నాయకులు వినోద్, మనోజ్, రమ్య ,సుశీల,రాగిణి, పూజిత, అలేఖ్య, త్రినాథ్, సంగీత్ , అంజలి ,భవాని, సింధు, శ్రావ్య ,శరణ్య, హారిక విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.